Niharika Husband| షేక్‌పేట్‌లో గొడవపై నిహారిక భర్త చైతన్య క్లారిటీ
షేక్ పేట్ (Shaikpet Clash) లోని అపార్టుమెంట్ వాసులకు తనకు మధ్య గొడవపై టాలీవుడ్ నటి నిహారిక (Niharika Konidela ) కొణిదెల భర్త చైతన్య జొన్నలగడ్డ క్లారిటీ ఇచ్చాడు.

టాలీవుడ్ నటి నిహారిక (Niharika Konidela ) కొణిదెల భర్త చైతన్య జొన్నలగడ్డ (Chaitanya Jonnalagadda)అర్థరాత్రి పూట గొడవ చేస్తూ తమకు ఇబ్బంది కలిగిస్తున్నాడని షేక్ పేట్ (Shaikpet Clash) లోని అపార్టుమెంట్ వాసులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా అపార్టుమెంట్ కు కొందరు యువకులు వచ్చి మద్యం తాగుతూ నానా హంగామా చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు తమ వ్యక్తిగత జీవితానికి అపార్టుమెంట్ వాసులు ఇబ్బంది కలిగిస్తున్నారంటూ చైతన్య కూడా అపార్టుమెంట్ వాసులపై ఫిర్యాదు చేశాడు. అయితే ఈ ఘటనపై క్లారిటీ ఇచ్చాడు చైతన్య.
అపార్టుమెంట్ లో ఫ్లాట్ తీసుకున్నప్పుడే ఆఫీస్ కోసమని యజమానికి చెప్పాం. అయితే అపార్టుమెంట్ అసోసియేషన్ కు క్లారిటీ లేకపోవడంతో తనతో వాదనకు దిగారని చైతన్య అన్నాడు. అపార్టుమెంట్ వాసులు గొడవ చేయడం వల్లే తాను పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని, కానీ తనమీదే ముందు కేసు నమోదైనట్టు వార్తలు రావడం బాధాకరమైన విషయమన్నాడు. ఆగస్టు 10లోపు ఫ్లాట్ ఖాళీ చేస్తున్నట్టు అపార్టుమెంట్ యజమానికి ముందే చెప్పామని చైతన్య తెలిపాడు.
ప్రస్తుతం అపార్టుమెంట్ వాసులతో కలిసి సమస్యను పరిష్కరించుకున్నట్టు చెప్పాడు. నిహారిక దంపతులు అపార్టుమెంట్ కమర్షియల్ గా వాడుకోవడంపై తాము అభ్యంతరం వ్యక్తం చేశామని, ఆఫీస్ కోసమే వాళ్లు ప్లాట్ తీసుకున్న విషయం తెలియకపోవడంతో గొడవ జరిగిందని అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీధర్ తెలిపారు. ఇప్పుడు అంతా కలిసి సమస్యను పరిష్కరించుకున్నట్టు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Meet Cute| జెట్ స్పీడ్‌లో నాని ‘మీట్ క్యూట్’ షూటింగ్
Friday New Movies | శుక్రవారం సందడి..ఆగస్ట్ 6న 7 సినిమాలు రిలీజ్
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

