Niharika | ‘రాకాస’ ప్రమోషన్స్‌లో బిజీగా నిహారిక.. అఖిల్‌తో షార్ట్ ఫిలిం అలా ఆగిపోయింది…
Niharika | మెగా కుటుంబానికి చెందిన నటి, నిర్మాత నిహారిక కొణిదెల ప్రస్తుతం తన నిర్మాణంలో వస్తున్న ‘రాకాస’ సినిమా ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉంది. ‘కమిటీ కుర్రోళ్లు’ వంటి విజయవంతమైన చిత్రానంతరం పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆమె నిర్మిస్తున్న రెండో చిత్రమిది. మానస శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు.
Niharika | మెగా కుటుంబానికి చెందిన నటి, నిర్మాత నిహారిక కొణిదెల ప్రస్తుతం తన నిర్మాణంలో వస్తున్న ‘రాకాస’ సినిమా ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉంది. ‘కమిటీ కుర్రోళ్లు’ వంటి విజయవంతమైన చిత్రానంతరం పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆమె నిర్మిస్తున్న రెండో చిత్రమిది. మానస శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఏప్రిల్ 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.ప్రచార కార్యక్రమాలన్నింటినీ తన భుజాలపై వేసుకుని ముందుకు తీసుకెళ్తున్న నిహారిక, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభ రోజుల్ని గుర్తు చేసుకుంది. నాగబాబు కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె, ముందుగా బుల్లితెరపై యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత హీరోయిన్గా వెండితెరకు పరిచయమైంది. 2016లో వచ్చిన ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.
అయితే హీరోయిన్గా మారే ముందు తాను చేసిన షార్ట్ ఫిల్మ్స్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ప్రస్తుతం హీరోగా రాణిస్తున్న విశ్వక్ సేన్‌తో కలిసి ‘టర్మ్స్ అండ్ కండిషన్స్’ అనే షార్ట్ ఫిల్మ్ చేయాల్సి ఉందని, కానీ అది ఒక పాటతోనే ఆగిపోయిందని తెలిపింది. అది పూర్తవ్వకపోవడం మాకు మంచిదే అయ్యింది. అప్పట్లో సోషల్ మీడియా ఇంతగా ఉండి ఉంటే, నేను అలాంటి షార్ట్ ఫిల్మ్స్ చేసేదాన్నో కాదో తెలియదు అంటూ నవ్వుతూ చెప్పింది. అలాగే అఖిల్ అక్కినేనితో కలిసి చేసిన మరో షార్ట్ ఫిల్మ్ గురించి కూడా ప్రస్తావించింది. దానికి ఎస్.ఎస్. కార్తికేయ దర్శకత్వం వహించగా, ఆ షార్ట్ ఫిల్మ్‌ను దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళికి చూపించగా, “ఇది రిలీజ్ చేయకపోతే బెటర్” అని చెప్పారని వెల్లడించింది. అది తన మొదటి షార్ట్ ఫిల్మ్ అని, ఆ సమయంలో యాక్టింగ్‌పై ఉన్న ప్యాషన్‌తో ఏది వచ్చినా చేసేదాన్నని తెలిపింది.
విశ్వక్ సేన్‌తో తన పరిచయం గురించి చెబుతూ, ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఆ షార్ట్ ఫిల్మ్ అవకాశం వచ్చిందని చెప్పింది. ఆ సమయంలో ఎలాంటి ప్రెషర్ లేకుండా, ఫ్రీగా ఎంజాయ్ చేస్తూ పని చేసేవాళ్లం. ఇప్పుడు చూస్తే అవి కాస్త క్రింజ్‌గా అనిపిస్తాయి కానీ, అప్పట్లో చాలా ఫన్‌గా అనిపించేది అని చెప్పింది. ఇక ‘రాకాస’ సినిమాపై నిహారిక భారీ ఆశలు పెట్టుకుంది. ఫాంటసీ, కామెడీ, థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో మంచి అనుభూతిని ఇస్తుందని చిత్ర యూనిట్ నమ్మకం వ్యక్తం చేస్తోంది. నిర్మాతగా తన ప్రయాణంలో మరో విజయాన్ని నమోదు చేయాలని నిహారిక ఆశిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్‌కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
Blue Drum Case | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితురాలికి మరణశిక్ష.. 10 నెలల కూతురు పరిస్థితి ఏంటి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

