‘సవ్యసాచి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల తార నిధి అగర్వాల్. తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ గ్లామర్ నాయికగా తనకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకుంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ సరసన ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో నటిస్తూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నది. తన నట ప్రయాణం గురించి నిధి అగర్వాల్ తాజాగా మాట్లాడుతూ…‘నా కెరీర్లో ‘హరి హర వీరమల్లు’ సినిమా ఎంతో ప్రత్యేకం. భారీ ప్రాజెక్ట్, బెస్ట్ క్యారెక్టర్..ఈ రెండూ ఈ సినిమాతోనే నాకు దక్కాయి. అందమే కాదు నటనలోనూ నిత్యం నేర్చుకునేందుకు ప్రయత్నిస్తుంటాను. నాకే కాదు ఎవరికీ ఏదీ పూర్తిగా తెలియదు. పాత్రలను అర్థం చేసుకోవడం, ఎక్కువ మంది దర్శకులతో కలిసి పనిచేయడం, విరివిగా సినిమాలు, ఓటీటీ కంటెంట్ చూడటం వల్ల నటిగా పరిణతి సాధిస్తున్నా’ అని చెప్పింది.