Pushpa 2 Stampede | ‘పుష్ప 2’ తొక్కిసలాట ఘటనపై NHRC సీరియస్.. సీఎస్‌కు నోటీసులు
NHRC | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' సినిమా ప్రిమీయర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్రంగా స్పందించింది.
Pushpa 2 Stampede | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ సినిమా ప్రిమీయర్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS)కి మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది.
ఈ తొక్కిసలాటలో ఒక మహిళ మరణించగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయంపై అందిన ఫిర్యాదును పరిశీలించిన జాతీయ మానవ హక్కుల కమిషన్, సినిమా థియేటర్ వద్ద తగిన భద్రతా చర్యలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను సీరియస్‌గా పరిగణిస్తూ, మృతురాలి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందించాలని అలాగే ఈ సంఘటనపై పూర్తి నివేదికను సమర్పించాలని తెలంగాణ పోలీసులను ఆదేశించింది. కాగా.. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

