Nuvvu Naaku Nachav | న్యూ ఇయర్ కానుకగా.. తెలుగు కల్ట్ క్లాసిక్ ‘నువ్వు నాకు నచ్చావ్’ రీ-రిలీజ్
Nuvvu Naaku Nachav RE Release | తెలుగు సినిమా చరిత్రలో ఆల్‌టైమ్ క్లాసిక్‌గా నిలిచిన వెంకటేష్, ఆర్తి అగర్వాల్‌ల చిత్రం 'నువ్వు నాకు నచ్చావ్' ఇప్పుడు 4K క్వాలిటీతో తిరిగి థియేటర్లలోకి రాబోతోంది.
Nuvvu Naaku Nachav RE Release | తెలుగు సినిమా చరిత్రలో ఆల్‌టైమ్ క్లాసిక్‌గా నిలిచిన వెంకటేష్, ఆర్తి అగర్వాల్‌ల చిత్రం ‘నువ్వు నాకు నచ్చావ్’ ఇప్పుడు 4K క్వాలిటీతో తిరిగి థియేటర్లలోకి రాబోతోంది. వెంకటేష్ మరియు త్రివిక్రమ్ అభిమానులందరికీ ఇది కొత్త సంవత్సరం పండుగ కానుంది. ఈ సందర్భంగా ‘నువ్వు నాకు నచ్చావ్’ 4K రీ-రిలీజ్ తేదీని చిత్ర నిర్మాణ సంస్థ ఖరారు చేసింది. న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమాను జనవరి 01న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ రీ-రిలీజ్ కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా ఆస్ట్రేలియా, యూరప్, యూకే వంటి దేశాల్లో కూడా రీ రిలీజ్ కాబోతుంది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచించిన అమరమైన డైలాగులు, హాస్యం ఈ సినిమా స్థాయిని పెంచాయి. ఈ సినిమాతోనే ఆయనకు లక్షల సంఖ్యలో అభిమానులు ఏర్పడ్డారు. విక్టరీ వెంకటేష్ గారి సహజమైన నటన, హాస్యం, కుటుంబ అనుబంధాలను పలికించిన తీరు ఈ సినిమాను ప్రతి తెలుగు కుటుంబానికి దగ్గర చేసింది. కే. విజయ భాస్కర్ గారు అందించిన శాంతమైన దర్శకత్వం, త్రివిక్రమ్ అద్భుతమైన కథాబలం కలగలిసి ఈ సినిమాను ఎవర్ గ్రీన్ హిట్‌గా నిలిపాయి. స్రవంతి రవికిషోర్ గారి స్రవంతి మూవీస్ బ్యానర్‌పై వచ్చిన ఈ సినిమాను, ఇప్పుడు అదే సంస్థ 4K లో ప్రేక్షకులకు అందించనుంది. కోటి గారి సంగీతం ఈ సినిమాకు అదనపు బలం.
వెంకటేష్ అభిమానులు, త్రివిక్రమ్ అభిమానులు, తెలుగు సినిమా ప్రేమికులు – అందరూ ఈ జ్ఞాపకాలను, ఫేవరెట్ డైలాగులను సోషల్ మీడియాలో #NNNReRelease #VenkyIsBack వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో పంచుకోవాలని చిత్ర యూనిట్ కోరింది. ఇది కేవలం సినిమా కాదు, ఒక భావన! అని ఈ సందర్భంగా తెలిపింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

