HanuMan | తేజ సజ్జా హనుమాన్ నుంచి నయా అప్డేట్
HanuMan | టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా (Tejasajja) కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం హనుమాన్ (HanuMan). ప్రశాంత్‌వర్మ (Prasanth Varma) దర్శకత్వం వహిస్తున్నాడు. హనుమాన్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు టీజర్ చూసిన మూవీ లవర్స్.
HanuMan | టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా (Tejasajja) కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం హనుమాన్ (HanuMan). ప్రశాంత్‌వర్మ (Prasanth Varma) దర్శకత్వం వహిస్తున్నాడు. తొలి తెలుగు సూపర్ హీరో సిరీస్‌గా వస్తున్న ఈ మూవీ టీజర్ ఇప్పటికే నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. యూనివర్సల్ కథాంశంతో హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కుతున్న హనుమాన్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు టీజర్ చూసిన మూవీ లవర్స్.
తాజాగా ఈ మూవీ నుంచి కొత్త అప్డేట్ అందించారు మేకర్స్. హనుమాన్ సౌండ్ మిక్సింగ్ పనులు మొదలయ్యాయి. DolbyAtmosతో మంత్రముగ్దులను చేసే ఆడియో జర్నీ సాగేలా కొత్త అనుభూతినిచ్చే మ్యూజిక్‌ను రెడీ చేస్తున్నాం.. అంటూ స్టూడియోలో నుంచి ఓ స్టిల్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇప్పుడీ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు.
ఈ మూవీలో కోలీవుడ్ భామ అమృతా అయ్యర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి గౌరా హరి-అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సంయుక్తంగా మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రీమతి చైతన్య సమర్పణలో వస్తున్న హనుమాన్కు అస్రిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, వెంకట్ కుమార్ జెట్టీ లైన్ ప్రొడ్యూసర్‌గా, కుశాల్ రెడ్డి అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
జాంబిరెడ్డి తర్వాత తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
Sound mixing for #HanuMan has begun! 🙏🏽
Experience the immersive audio journey we are creating in #DolbyAtmos ! 😊@Primeshowtweets pic.twitter.com/fGCyU8O2NS
— Prasanth Varma (@PrasanthVarma) November 23, 2023
హనుమాన్ అండర్ వాటర్ షాట్స్..
After a phenomenal response to the epic teaser
Team #HanuMan shot a breath-taking underwater sequence on a grand scale that will leave the audience spellbound 💥
A @PrasanthVarma Film
🌟ing @tejasajja123 @Actor_Amritha @Niran_Reddy @Chaitanyaniran @Primeshowtweets pic.twitter.com/ry4K18UGg3— Vamsi Kaka (@vamsikaka) December 20, 2022
హనుమాన్ టీజర్.. వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

