Samantha | సామ్ ప్లీజ్ ఎవరితోనైనా డేటింగ్ చేయండి.. అభిమాని పోస్ట్‌కు సామ్ హార్ట్ టచింగ్ రియాక్షన్
Actress Samantha | తొలి సినిమా 'ఏమాయ చేశావే'తో అందరిని మాయలో పడేసింది సమంత. ఈ సినిమా సక్సెస్‌తో సామ్ కెరీర్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ తర్వాత వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ 13ఏళ్లుగా దక్షిణాదిలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతుంది.
Actress Samantha | తొలి సినిమా ‘ఏమాయ చేశావే’తో అందరిని మాయలో పడేసింది సమంత. ఈ సినిమా సక్సెస్‌తో సామ్ కెరీర్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ తర్వాత వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ 13ఏళ్లుగా దక్షిణాదిలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతుంది. ప్రస్తుతం సామ్ నటించిన శాకుంతలం రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మరో మూడు వారాల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో సమంత ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు వరుసగా ప్రమోషన్లలో పాల్గొంటుంది. తాజాగా సామ్, సుమతో జరిపిన ఓ ఇంటర్వూలో సినిమా గురించి, పర్సనల్ లైఫ్ గురించి పలు విషయాలను ముచ్చటించింది.
సమంత అభిమాని ఒకరు ఆ వీడియోను ట్విట్టర్లో పోస్తూ ఇది చెప్పేంత చనువు నాకు లేదని తెలుసు.. కానీ ప్లీజ్ సమంత ప్లీజ్ ఎవరితోనైనా డేటింగ్ చేయండి అంటూ పోస్ట్ పెట్టింది. దానికి సమంత స్పందించి మీ లాగా నన్ను ఎవరు ప్రేమిస్తారు అంటూ హార్ట్ ఎమోజీని పెట్టింది. దీంతో పలువురు సమంత అభిమానులు నీకు మేమున్నాము సామ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా సమంత రెండేళ్ల క్రితం నాగచైతన్యతో విడాకులు తీసుకుంది. ప్రస్తుతం ఈ ఇద్దరూ ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు.
ఇక శాకుంతలం విషయానికొస్తే కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో సామ్ శకుంతలగా నటించగా.. మలయాళ నటుడు దేవ్ మోహన్ శకుంతల ప్రియుడుగా దుష్యంతుడి పాత్రలో నటించాడు. ఇక గుణశేఖర్ ఈ సినిమాను రుద్రమదేవి తర్వాత దాదాపు ఏడేళ్లు గ్యాప్ తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్లు సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేశాయి.
Who will love me like you do 🫶🏻 https://t.co/kTDEaF5xD5
— Samantha (@Samanthaprabhu2) March 26, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

