కోలీవుడ్ దర్శకుడు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) డైరెక్ట్ చేస్తున్న తాజా చిత్రం కాతువాకుల రెండు కాధల్ (Kaathu Vaakula Rendu Kadhal). కోలీవుడ్ స్టార్ యాక్టర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi), నయనతార (Nayanthara), సమంత (Samantha) క్రేజీ కాంబినేషన్లో ట్రయాంగిల్ లవ్‌స్టోరీ గా వస్తోంది. కాగా ఈ చిత్రం నుంచి టూ..టూ..టూ అంటూ సాగే సాంగ్ (Two Two Two song)ను విడుదల చేసిన విషయం తెలిసిందే.
అనిరుధ్ కంపోజ్ చేసిన మ్యూజిక్ అందరినీ షేక్ చేయడం గ్యారంటీ అని ప్రోమోతోనే తెలిసిపోతుంది. అయితే నెటిజన్ల దృష్టి అంతా హీరోయిన్ల లుక్‌పై పడ్డది. పాటలో నయనతార ట్రెడిషనల్ శారీ లుక్‌లో, సమంత పొట్టిడ్రెస్లో కనిపిస్తున్నారు. అయితే ఇక్కడే చిక్కొచ్చిపడింది. విఘ్నశ్ శివన్ (నయన్ బాయ్‌ఫ్రెండ్) తన కాబోయే భార్య నయనతారను సంప్రదాయక లుక్‌లో చూపిస్తూ..సమంతను అలా చూపించడం కొందరికి ఇది మింగుడుపడటం లేదు.
సాంగ్ గ్లింప్స్ వీడియోపై ఓ లుక్కేయండి మరీ..!
నయన్ ను మాత్రం సంప్రదాయబద్దంగా చూపించి..సామ్‌ను హాట్ లుక్‌లో చూపించడమేంటని ట్రోల్స్ చేస్తున్నారు. మరి దీనిపై విఘ్నేశ్ శివన్ ఏమైనా స్పందిస్తాడా..? లేదంటే ఇలాంటి కామెంట్లు మామూలేనని వదిలిపెడతాడా..? చూడాలి. ఈ చిత్రం ఏప్రిల్ 28న థియేటర్లలో సందడి చేయనుంది. విజయ్ సేతుపతి సమంత, నయన్‌తో కలిసి ప్రేక్షకుల పుల్ ఎంటర్టైన్ మెంట్ అందించడం ఖాయమని తాజా పాట చెబుతోంది.