బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఈ అమ్మడు సామాజిక మాధ్యమాలలో హాట్ హాట్ ఫొటోలు షేర్ చేయడమే కాకుండా ప్రేమ, పెళ్లి, రొమాన్స్ విషయాలపై ఘాటైన కామెంట్స్ చేస్తుంటుంది. ఈ క్రమంలో పలు విమర్శలు కూడా చేస్తుంటుంది.
ఆ మధ్య సెక్స్, రిలేషన్స్, లవ్, అఫైర్స్ వంటి బోల్డ్ విషయాలపై తండ్రి కూతుళ్ళ మధ్య మెచ్యూర్డ్ సంభాషణ జరిగింది. నా బాయ్ ఫ్రెండ్ షేన్ ని మీరు ఇష్టపడుతున్నారా? అని ఆలియా అడుగగా.. షేన్ చాలా మంచివాడు. ఎవరితో స్నేహం చేయాలనే విషయంపై అతనికి మంచి అవగాహన ఉంది. అలాగే అబ్బాయిలతో నువ్వు జాగ్రత్తగా ఉంటావనే ధైర్యం నాకు ఉంది.. అని అనురాగ్ సమాధానం చెప్పాడు.
దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూతురు అలియా చాలా కాలంగా ప్రియుడు షేన్ గ్రెగోయ్ తో కలిసి తండ్రి ఇంట్లోనే ఉంటున్నారు. రీసెంట్గా షేన్ 22వ వసంతంలోకి అడుగుపెట్టగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆలియా.. ఈ ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతురాలైన అమ్మాయిగా నన్ను మార్చావు. నువ్వు నాతో ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నాను. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను అని ఆయనతో కలిసి దిగిన హాట్ పిక్స్ షేర్ చేసింది. దీంతో నెటిజన్స్ ఆమెపై తెగ ట్రోల్ చేస్తున్నారు.