Rajinikanth: రజనీకాంత్ పోస్టర్‌కి రక్తాభిషేకం.. వైరల్‌గా మారిన వీడియో

అభిమానం పేరుతో ఫ్యాన్స్ చేస్తున్న దుర్మార్గాలు అందరు నోరెళ్ల పెట్టేలా చేస్తున్నాయి. అభిమానం ఉండాలే కాని అది కొంత వరకు మంచిది. అభిమానం ముసుగులో కొట్లాటలకు దిగడం, వేరే హీరో ఫ్యాన్స్‌ని రక్తం కళ్ల చూడడం అనేది మంచి పద్దతి కాదు. అయితే తాజాగా అభిమానం ముసుగులో రజనీకాంత్ ఫ్యాన్స్ కొందరు చేసిన రచ్చపై ప్రతి ఒక్కరు మండిపడుతున్నారు.
దర్భార్ చిత్రం తర్వాత రజనీకాంత్ నటించిన చిత్రం అన్నాత్తె. ఈ మూవీని స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కించగా, ‘సన్ పిక్చర్స్’ సంస్థ నిర్మిస్తోంది. నయనతార కీర్తి సురేష్ మీనా ఖుష్బూ ఈ సినిమాలో నటిస్తున్నారు. వినాయక చవితి సందర్బంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో తెల్లషర్టు పంచెకట్టుతో అందరినీ అలరించారు.
ఇక సాయంత్రం మోషన్ పోస్టర్ విడుదల చేయగా, అందులో బైకుపై వస్తూ చేతిలో ఉన్నా కత్తితో మంటలు రాజేస్తున్నారు. విభిన్నమైన యాక్షన్ డ్రామా కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే తమిళనాడులో కొందరు రజనీ ఫ్యాన్స్ పోస్టర్ ను భారీ సైజులో కటౌట్ గా కట్టి దాని ముందు ఓ మేకపోతును బలిచ్చారు. కటౌట్ ముందు మేకపోతును నిలబెట్టి..ఒక్క వేటుతో తల తెగ నరికారు. ఆ రక్తంతో పోస్టర్‌కి రక్తాభిషేకం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా, దీనిపై నెటిజన్స్ మండిపడుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- annathe
- fans
- rajinikanth
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

