Nenu Student Sir Movie | నేను స్టూడెంట్ సార్ మూవీ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్. రిలీజ్ ఎప్పుడంటే?
Nenu Student Sir Movie Trailer | గతేడాది దసరాకు పెద్ద సినిమాలతో పోటీకి దిగి చేతులు కాల్చుకున్నాడు బెల్లంకొండ గణేష్. ఆయన డెబ్యూ సినిమాగా 'స్వాతిముత్యం' అనే అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో గతేడాది అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
Nenu Student Sir Movie Trailer | గతేడాది దసరాకు పెద్ద సినిమాలతో పోటీకి దిగి చేతులు కాల్చుకున్నాడు బెల్లంకొండ గణేష్. ఆయన డెబ్యూ సినిమాగా ‘స్వాతిముత్యం’ అనే అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో గతేడాది అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తొలిరోజు నుంచి మంచి రివ్యూలను తెచ్చుకున్న ఈ సినిమా పోటీగా పెద్ద సినిమాలుండటంతో కమర్షియల్‌గా సేఫ్ కాలేకపోయింది. ఇక ఓటీటీలో విడుదలయ్యాకు ఎక్కడలేని ఆదరణ వచ్చింది. ప్రస్తుతం ఆయన నటించిన నేను స్డూడెంట్ సార్ మూవీ రిలీజ్‌కు సిద్దంగా ఉంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్లు సినిమాపై మంచి హైపే క్రియేట్ చేశాయి. కాగా మేకర్స్ తాజాగా ట్రైలర్‌కు సంబంధించిన అప్డేట్ను ప్రకటించారు.
ఈ సినిమా ట్రైలర్‌ను సాయంత్రం 6గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం తాజాగా వెల్లడించింది. రాఖి ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నాంది ఫేమ్ సతీష్ వర్మ నిర్మించాడు. గణేష్‌కు జోడీగా అవంతిక హీరోయిన్గా నటిస్తుంది. సముద్రఖని కీలకపాత్రలో నటించిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ బాణీలు సమకూర్చాడు. ఇక ఈ సినిమా జూన్ 2న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

