Nenu Student Sir Movie | ఆసక్తి రేకేత్తిస్తున్న నేను స్టూడెంట్ సార్ మూవీ ట్రైలర్..!
ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన గ్లింప్స్, టీజర్లు సినిమాపై మంచి హైపే క్రియేట్ చేశాయి. కాగా మేకర్స్ తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్‌తోనే సినిమా కాన్సెప్ట్‌పై కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు చిత్రబృందం.
Nenu Student Sir Movie Trailer | గతేడాది దసరాకు పెద్ద సినిమాలతో పోటీకి దిగి చేతులు కాల్చుకున్నాడు బెల్లంకొండ గణేష్. ఆయన డెబ్యూ సినిమాగా ‘స్వాతిముత్యం’ అనే అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో గతేడాది అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తొలిరోజు నుంచి మంచి రివ్యూలను తెచ్చుకున్న ఈ సినిమా పోటీగా పెద్ద సినిమాలుండటంతో కమర్షియల్‌గా సేఫ్ కాలేకపోయింది. ఇక ఓటీటీలో విడుదలయ్యాక ఎక్కడలేని ఆదరణ వచ్చింది. ఇంత మంచి సినిమాను రాంగ్ టైమ్‌లో రిలీజ్ చేశారని పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. ఇక ఇప్పుడు ఆయన నేను స్డూడెంట్ సార్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు.
ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్లు సినిమాపై మంచి హైపే క్రియేట్ చేశాయి. కాగా మేకర్స్ తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్‌తోనే సినిమా కాన్సెప్ట్‌పై కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు చిత్రబృందం. హీరో ఎంతో ఇష్టంగా ఓ ఐఫోన్ కొనుక్కుంటాడు. దానికి బుచ్చిబాబు అని పేరు కూడా పెడుతాడు. ఫోన్ కొన్న ఆనందంలో ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు, వీడియోలు తీస్తుంటాడు. ఈ క్రమంలో ఆ ఫోన్లో అనుకోకుండా ఓ హత్యకు సంబంధించిన వీడియో రికార్డు అవుతుంది. దాంతో కమిషనర్ ఆ హత్య చేసింది హీరోనే అని కావాలని ఇరుకించడానికి ట్రై చేస్తుంటాడు. హీరో హత్య చేసింది తను కాదు అంటున్న వినిపించుకోకుండా అరెస్ట్ చేస్తాడు. ఇంతకీ హత్య చేసింది ఎవరు ఆ హత్యలో హీరోను ఇరికించడానికి కారణం ఏంటీ కమిషనర్‌కు హీరోకు మధ్య గొడవలేంటి అనే ఎన్నో ప్రశ్నలతో ట్రైలర్ ఉంది.
ట్రైలర్ చూస్తుంటే ఇలాంటి కథను మనం ఎన్నో సార్లు చూసినట్లే అనిపిస్తున్నా.. ఒక ఫోన్ కీలకం అవడమనేది కాస్త ఆసక్తిని రేకెత్తిస్తుంది. సముద్రఖనికి పవర్ ఫుల్ రోల్ పడ్డట్లు కనిపిస్తుంది. ఇక యాక్షన్‌ను కూడా మేకర్స్ పుష్కలంగా దట్టించినట్లు ట్రైలర్లో స్పష్టం అయింది. రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను సతీష్ వర్మ నిర్మించాడు. గణేష్‌కు జోడీగా అవంతిక దస్సాని నటిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

