Nenu Student Sir Movie | ఆసక్తికరంగా బెల్లంకొండ గణేష్ ‘నేను స్టూడెంట్ సార్’ టీజర్.!
Nenu Student Sir Teaser | టాలీవుడ్ అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్‌బాబు చిన్న కొడుకు గణేష్ ‘స్వాతిముత్యం’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజైన ఈ చిత్రం మొదటి షో నుండి పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. కానీ బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్‌గా మిగిలింది.
Nenu Student Sir Teaser | టాలీవుడ్ అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్‌బాబు చిన్న కొడుకు గణేష్ ‘స్వాతిముత్యం’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజైన ఈ చిత్రం మొదటి షో నుండి పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. కానీ బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్‌గా మిగిలింది. పోటీగా ‘గాడ్‌ఫాదర్’, ‘ది ఘోస్ట్’ చిత్రాలు ఉండటంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది. అయితే ఈ చిత్రంలో గణేష్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఈయన నేను స్టూడెంట్ సార్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. రాఖి ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజైంది.
హీరో కష్టపడి ఐఫోన్ కొనుక్కుంటాడు. అయితే ఈ ఫోన్‌ను పోలీసులు కొట్టేస్తారు. దాంతో హీరో కమిషనర్‌కు కంప్లైంట్ ఇవ్వడానికి కమిషనర్ ఆఫీస్‌కు వెళ్తాడు. అయితే అప్పుడు హీరోను ఎవరో కావాలని ట్రప్ చేసినట్లు హీరోకు తెలుస్తుంది ఆ తర్వాత ఏం జరిగింది అనే కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కినట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. అసలు హీరోను ఎవరు ట్రాప్‌లో పడేశారు. ఆ ఫోన్లో ఏముంది అనేది సినిమా రిలీజయ్యాక తెలుస్తుంది. టీజర్‌తోనే మేకర్స్ సినిమాపై తీవ్ర ఆసక్తిని పెంచారు. సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నాంది ఫేమ్ సతీష్ వర్మ నిర్మించాడు. గణేష్‌కు జోడీగా అవంతిక హీరోయిన్గా నటిస్తుంది. సముద్రఖని కీలకపాత్రలో నటించిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ బాణీలు సమకూరుస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

