Nenu Student Sir Movie | అప్పుడే ఓటీటీలోకి నేను స్టూడెంట్ సార్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Nenu Student Sir Movie on Ott | టీజర్, ట్రైలర్లు గట్రా ఈ సినిమాపై మంచి హైప్‌నే తీసుకొచ్చాయి. పైగా సుముద్రఖని, సునీల్ వంటి స్టార్ కాస్ట్ ఈ సినిమాలో ఉండటంతో మంచి బిజినెస్ కూడా చేసింది.
Nenu Student Sir Movie on Ott | గతేడాది దసరాకు పెద్ద సినిమాలతో పోటీకి దిగి చేతులు కాల్చుకున్నాడు బెల్లంకొండ గణేష్. ఆయన డెబ్యూగా ‘స్వాతిముత్యం’ అనే అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో గతేడాది అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తొలిరోజు నుంచి మంచి రివ్యూలను తెచ్చుకున్న ఈ సినిమా పోటీగా పెద్ద సినిమాలుండటంతో కమర్షియల్‌గా సేఫ్ కాలేకపోయింది. ఇక ఓటీటీలో విడుదలయ్యాక ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇంత మంచి సినిమాను రాంగ్ టైమ్‌లో రిలీజ్ చేశారని ఎందరో సినీ లవర్స్ అభిప్రాయపడ్డారు. ఇక రెండో సినిమాగా నేను స్టూడెంట్ సార్ అనే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాచేశాడు.
టీజర్, ట్రైలర్లు గట్రా సినిమాపై మంచి హైప్‌నే తీసుకొచ్చాయి. పైగా సుముద్రఖని, సునీల్ వంటి స్టార్ కాస్ట్ ఈ సినిమాలో ఉండటంతో మంచి బిజినెస్ కూడా చేసింది. తీరా రిలీజయ్యాక తొలిరోజే మిక్స్డ్ రివ్యూలు తెచ్చుకుని డిజాస్టర్‌గా మిగిలిపోయింది. కాన్సెప్ట్ బాగానే ఉన్న కథనం ఎంగేజింగ్‌గా లేకపోవడంతో ప్రేక్షకులు నిర్మొహమాటం లేకుండా తిప్పి కొట్టారు. ఇక ఇదిల ఉంటే తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు ముస్తాబవుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో జూన్ 14 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గణేష్‌కు జోడీగా అవంతిక దస్సాని నటించింది. నాంది ఫేమ్ సతీష్ వర్మ నిర్మించిన ఈ సినిమాకు మహతి స్వరసాగర్ స్వరాలు సమకూర్చాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

