హవీష్ కథానాయకుడిగా రూపొందుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్ ‘నేను రెడీ’. కావ్య థాపర్ కథానాయిక. త్రినాథరావు నక్కిన దర్శకుడు. కోనేరు సత్యనారాయణ, కోనేరు నిఖిల నిర్మాతలు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ రెండోవారంలో విడుదల కానున్నది. బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీపై ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతాన్ని తెరకెక్కించారు. ప్రచారంలో భాగంగా శనివారం ఆ పాటకు సంబంధించిన పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు.
ఓ అందమైన మహల్ మధ్య వెండిరంగులో మెరుస్తున్న దుస్తులలో, కొలనులో వికసించిన తెల్ల కలువలా కనిపిస్తున్న నర్గీస్ ఫక్రీని ఈ పోస్టర్లో చూడొచ్చు. బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, వెన్నెల కిశోర్, మురళీశర్మ, వీటీవీ గణేశ్, గోపరాజు రమణ, హరితేజ, మహతి, రూపలక్ష్మి తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ, మాటలు: విక్రాంత్ శ్రీనివాస్, కెమెరా: నిజార్ షఫీ, సంగీతం: మిక్కీ జె.మేయర్, నిర్మాణం: హార్నిక్స్ ఇండియా ఎల్ఎల్పీ.