Neha Sharma | రామ్ చరణ్ డెబ్యూ మూవీ చిరుతలో హీరోయిన్గా మెరిసి తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పింది బీహార్ భామ నేహా శర్మ (Neha Sharma). ఎంట్రీతోనే మంచి బ్రేక్ అందుకున్న ఈ భామకు ఆ తర్వాత చెప్పుకునేంత సినిమాలు లేకుండా పోయాయి.
సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉండే ఈ భామ ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్‌తో నెటిజన్లను ఖుషీ చేస్తుంటుంది. నేహా శర్మ తాజాగా ఐస్ బకెట్ ఛాలెంజ్‌లో పాల్గొన్నది. నేహా శర్మ చల్లటి వాతావరణంలో రెడ్ స్విమ్ షూట్లో హాట్ హాట్ లుక్‌లో మెస్మరైజ్ చేస్తూ.. చల్ల చల్లని ఐస్లోకి దిగి ఛాలెంజ్‌లో జాయిన్ అయింది. సోదరి ఐషా శర్మ (Aisha Sharma)కూడా ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నది. శర్మ సిస్టర్స్ ఐస్ బకెట్ ఛాలెంజ్ వీడియోలు ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.
నేహాశర్మ చిరుత తర్వాత వరుణ్ సందేశ్ సరసన ‘కుర్రాడు’ సినిమాలోనూ కనిపించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయింది. నేహా శర్మ ఈ ఏడాది Jogira Sara Ra Ra సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఐస్ బకెట్ ఛాలెంజ్‌లో శర్మ సిస్టర్స్ ఇలా..
Sharma Sisters r amazing 😍😘#NehaSharma #AishaSharma pic.twitter.com/9e4fNUFtV0
— ActressExclusively (@ActressExclusi1) August 6, 2023