మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డెబ్యూ చిత్రం చిరుతలో కథానాయికగా నటించిన నేహా శర్మ అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ ఆ సినిమాలో తన అందంతో పాటు అభినయంతో ఎంతగానో ఆకట్టుకుంది. చిరుత సినిమా నేహాకి మంచి బ్రేక్ ఇచ్చిన ఆ తర్వాత పెద్దగా ఆఫర్స్ అందుకోలేకపోయింది. దీంతో సోషల్ మీడియానే ఎక్కువగా నమ్ముకుంటుంది.
తరచు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ యువతకి కంటిపై నిద్ర లేకుండా చేస్తుంది నేహా. తాజాగా వైట్ బికినీలో ఓర చూపులు చూస్తూ ఫొటోలకు ఫోజులిచ్చి అందరి మతులు పోగొడుతుంది నేహా. శృంగార దేవలా కనిపిస్తున్న నేహాని చూపి ప్రతి ఒక్కరు మైమరచిపోతున్నారు.
నేహాశర్మ చిరుత తర్వాత వరుణ్ సందేశ్ సరసన ‘కుర్రాడు’ సినిమాలోనూ కనిపించింది. రెండు సినిమాలు చేసినా టాలీవుడ్లో అమ్మడికి పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో తిరిగి ముంబయి ఫ్లైట్ ఎక్కిన నేహా.. అక్కడ చిన్న, అప్‌కమింగ్ హీరోలతో కలిసి సందడి చేస్తుంది. బాలీవుడ్లో ఇమ్రాన్ హస్మీ సరసన ‘క్రూక్’ సినిమాలో హాట్‌గా కనిపించి అందర్నీ ఆకట్టుకున్న నేహా కోలీవుడ్ ఆఫర్స్ కూడా అందుకుంటున్నట్టు తెలుస్తుంది.