Ante Sundaraniki | లీలా పాత్రలో నజ్రియానజీమ్.. ఆకట్టుకుంటున్న ‘అంటే సుందరానికీ’ గ్లింప్స్
సినీరంగంలో కొందరు హీరోయిన్లు ఎన్ని సినిమాలు చేసిన పెద్దగా గుర్తింపు ఉండదు. కానీ మరి కొందరు హీరోయిన్లకు మాత్రం ఒక్క సినిమాతోనే పది సినిమాలకు సరిపడ గుర్తింపు వస్తుంది. ఇక ఇదే కోవలోకి చెందిన హీరోయిన్ నజ్రియా నజీమ్.
Ante Sundaraniki | సినీరంగంలో కొందరు హీరోయిన్లు ఎన్ని సినిమాలు చేసిన పెద్దగా గుర్తింపు ఉండదు. కానీ మరి కొందరు హీరోయిన్లకు మాత్రం ఒక్క సినిమాతోనే పది సినిమాలకు సరిపడ గుర్తింపు వస్తుంది. ఇదే కోవలోకి చెందిన హీరోయిన్ నజ్రియా నజీమ్. ‘రాజారాణి’ సినిమాతో ఇటు తెలుగు, అటు తమిళ ప్రేక్షకులను తన నటన, అభినయంతో విపరీతంగా ఆకట్టుకుంది. అప్పటికే స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న నయనతారకు పోటీగాఈ చిత్రంలో నటించి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఈ ఒక్క చిత్రంతోనే నజ్రియాకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం ఈమె నాని హీరోగా నటిస్తున్న ‘అంటే సుందరానికీ’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది.
ఇప్పటికే నాని బర్త్‌డే సందర్భంగా విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్‌లుక్‌తో పాటు ‘ప్రేయర్ ఆఫ్ లీలా’ అంటూ టీజర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్‌కు విశేష స్పందన వస్తుంది. ఈ చిత్రానికి ‘బ్రోచేవారెవరురా’ ఫేం వివేక్ ఆత్రేయా దర్శకత్వం వహించాడు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెంచుతున్నాయి. ఇప్పిటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం వేసవి కానుకగా జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Meet our Leela
Leela Thomas
Heart of #AnteSundaraniki ♥️https://t.co/Rig5xIQZqP#Nazriyafahad #VivekAthreya @MythriOfficial @oddphysce @saregamasouth pic.twitter.com/LtvBwmrU6d— Nani (@NameisNani) March 17, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

