Nayanthara | ఒకరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు.. ట్రోలర్స్‌కి గట్టిగా బదులిచ్చిన నయనతార
Nayanthara | లేడి సూపర్ స్టార్ నయనతార ఇద్దరు పిల్లలకి తల్లైన కూడా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతుంది. ప్రస్తుతం ఆమె ఖాతాలో అరడజనుకి పైగా చిత్రాలు ఉన్నాయి. తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషలలో కూడా సినిమాలు చేస్తుంది. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందరి హీరోలతో కలిసి పని చేస్తుంది.
Nayanthara | లేడి సూపర్ స్టార్ నయనతార ఇద్దరు పిల్లలకి తల్లైన కూడా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతుంది. ప్రస్తుతం ఆమె ఖాతాలో అరడజనుకి పైగా చిత్రాలు ఉన్నాయి. తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషలలో కూడా సినిమాలు చేస్తుంది. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందరి హీరోలతో కలిసి పని చేస్తుంది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తుంది. ఈ మూవీని అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు. అయితే సాధారణంగా నయనతార ప్రమోషన్ కార్యక్రమాలకి చాలా దూరంగా ఉంటుంది. కాని చిరు సినిమాకి ముందు నుండే ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఆ మధ్య అనీల్ రావిపూడి చెన్నైకి వెళ్లి ఆమెతో ఓ ప్రమోషన్ వీడియో చేయించాడు.
అది నెట్టింట తెగ వైరల్ అయింది. సాధారణంగా ఎంత పెద్ద హీరో సినిమా అయిన సరే నయనతార పెద్దగా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనదు. వారికి ముందుగానే హింట్ ఇచ్చేస్తుంది. తమిళ సినిమా ప్రమోషన్స్‌లో కూడా ఎప్పుడు పెద్దగా పాల్గొనింది లేదు. కాని చిరు- అనీల్ రావిపూడి సినిమాకి ముందు నుండే ప్రమోషన్ మొదలు పెట్టేసరికి తమిళ సినిమాల ప్రమోషన్లలో ఏనాడూ పాల్గొనని నువ్వు తెలుగు సినిమాకి అదీ షూటింగ్ మొదలు కాకముందే ప్రమోషన్స్ చేస్తున్నావు. తెలుగు సినిమాలంటే అంత ఇష్టం ఉందా.. అయితే టాలీవుడ్‌కే షిఫ్ట్ అయిపోవచ్చు కదా అని కొందరు ట్రోల్ చేస్తున్నారు.
ట్రోలర్స్‌కి నయనతార గట్టిగా బదులు ఇచ్చింది. అనవసర విషయాలకి టైమ్ వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. నా వీలును బట్టి నిర్మాతలకు సహకరిస్తూనే ఉంటా. ప్రమోషన్లకి వెళ్లాలా?.. వద్దా.. అన్నది కూడా నా పర్సనల్ విషయం. ఈ విషయంలో ఒకరికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని తనదైన స్టైల్లో రిప్లయ్ ఇచ్చింది లేడీ సూపర్‌స్టార్. గతంలో మెగాస్టార్ చిరంజీవితో నయనతార రెండు సినిమాలు చేయగా.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో మూడోసారి నటిస్తోంది.ఈ సినిమా హిట్ అయితే నయనతారకి టాలీవుడ్లో తిరుగు ఉండదు అని చెప్పాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

