Nayanthara | ఆ దర్శకుడితో నయనతార ప్రేమకథ.. ఎలా మొదలైందంటే!
అగ్ర నాయిక నయనతారను ఆమె అభిమానులు లేడీ సూపర్‌స్టార్ అని గర్వంగా పిలుచుకుంటారు. బుల్లితెర ప్రయోక్తగా కెరీర్‌ను మొదలుపెట్టి అగ్ర కథానాయికగా ఎదిగిన ఆమె ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఈ నేపథ్యంలో ‘నయనతార: బీయాండ్ ది ఫెయిరీటేల్' పేరుతో ఆమె విజయవంతమైన సినీ ప్రస్థానాన్ని ఆవిష్కరిస్తూ రూపొందిన డాక్యుమెంటరీ త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.
Nayanthara | అగ్ర నాయిక నయనతారను ఆమె అభిమానులు లేడీ సూపర్‌స్టార్ అని గర్వంగా పిలుచుకుంటారు. బుల్లితెర ప్రయోక్తగా కెరీర్‌ను మొదలుపెట్టి అగ్ర కథానాయికగా ఎదిగిన ఆమె ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఈ నేపథ్యంలో ‘నయనతార: బీయాండ్ ది ఫెయిరీటేల్’ పేరుతో ఆమె విజయవంతమైన సినీ ప్రస్థానాన్ని ఆవిష్కరిస్తూ రూపొందిన డాక్యుమెంటరీ త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఇందులో ఆమె వ్యక్తిగత, సినీ జర్నీకి సంబంధించిన అనేక ఆసక్తికరమైన అంశాలను పొందుపరిచారు.
తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో నయనతార ప్రేమాయణం, పెళ్లి వరకు సాగిన వారి ప్రయాణాన్ని కూడా ఈ డాక్యుమెంటరీలో వివరించారని తెలిసింది. ఈ సందర్భంగా విఘ్నేష్ శివన్‌తో తాను ప్రేమలో పడిన క్షణాలను నయనతార గుర్తు చేసుకుంది. విఘ్నేష్‌శివన్ దర్శకత్వం వహించిన ‘నానుమ్ రౌడీదాన్’ (2015) సెట్స్‌లో తొలిసారి వీరిద్దరూ కలుసుకున్నారు. నయనతార మాట్లాడుతూ ‘పాండిచ్చేరిలోని ఓ మారుమూల ప్రాంతంలో షూటింగ్ పెట్టారు. విజయ్ సేతుపతి మీద సీన్స్ షూట్ చేస్తున్నారు.
అప్పుడే నేను దూరంగా విఘ్నేష్ శివన్‌ను గమనించా. మోముపై చెరగని చిరునవ్వు, సన్నివేశాన్ని వివరించే శైలి, దర్శకుడిగా అతని ప్రత్యేకమైన పనితీరు నన్ను ఆకట్టుకుంది. ఆ క్షణంలోనే అతని ప్రేమలో పడిపోయా’ అని నయనతార చెప్పింది. దాదాపు ఏడేళ్ల సుదీర్ఘ ప్రేమాయణం అనంతరం 2022 జూన్ 9న ఈ జంట వివాహం చేసుకున్నారు. ఈ దంపతులు సరోగసీ విధానం ద్వారా ఉయిర్, ఉలగం అనే కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

