ప్రచార కార్యక్రమా లకు దూరంగా ఉండే నయనతార చాలా ఏళ్ల తర్వాత మీడియా ముం దుకొచ్చింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో యువ నాయిక మాళవిక మోహనన్ తనపై చేసిన కామెంట్స్‌కు బదులిచ్చింది. ఆసుపత్రి తా లూకు సన్నివేశంలో న యనతార మేకప్ దట్టించుకొని, లిప్‌స్టిక్‌తో కనిపించడం బాగోలేదని, తాను ఆ సీన్స్ చూసి షాక్ అయ్యానని మాళవిక మోహనన్ గతంలో వ్యాఖ్యానించింది.
ఆమె మాటలపై నయనతార స్పందిస్తూ ‘ఆమె పేరు ప్రస్తావించడం నాకు ఇష్టం లేదు. ఆసుపత్రి సీన్లో నేను మేకప్, చక్కటి హెయిర్‌ైస్టెల్‌తో కనిపించడం ఆ హీరోయిన్‌కు తప్పుగా అనిపించింది. అయితే సినిమాల విషయంలో రియలిస్టిక్, కమర్షియల్ మూవీస్ అనే తేడా ఉంటుంది. సహజత్వాన్ని ప్రతిబింబించే చిత్రాల్లో లుక్స్‌పరంగా తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి. కమర్షియల్ చిత్రాల్లో దర్శకుడి సూచనల ప్రకారం నటించాల్సి ఉంటుంది. వాణిజ్య కథలో నాయికల్ని అలాగే చూపిస్తారు’ అంటూ నయనతార స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.