‘కనుసైగలతోనే మాఫియా సామ్రాజ్యాన్ని, రాజకీయాల్ని శాసించే గాడ్‌ఫాదర్ అతను. మంచికి మంచి..చెడుకు చెడు అన్నది అతని సిద్ధాంతం. అలాంటి శక్తివంతమైన వ్యక్తి రాష్ర్టానికి వచ్చిన పెద్ద సమస్యను పరిష్కరించడానికి రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో అతని ఎదురైన పరిస్థితులేమిటన్నదే మా సినిమా ఇతివృత్తం’ అంటున్నారు మోహన్‌రాజా. ఆయన దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా రూపొందిస్తున్న చిత్రం ‘గాడ్‌ఫాదర్’. ఆర్బీ చౌదరి, ఎన్వీప్రసాద్ నిర్మాతలు. నయనతార కీలక పాత్రధారిణి. ఈ సినిమా హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయింది. ఇందులో నయనతార పాల్గొంది. ఈ సందర్భంగా గురువారం ఓ ఫొటోను విడుదల చేశారు. ‘రాజకీయాంశాలు కలబోసిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. చిరంజీవి పాత్ర చిత్రణ అత్యంత శక్తివంతంగా ఉంటుంది. హైదరాబాద్ షెడ్యూల్లో ముఖ్యఘట్టాలను తెరకెక్కించాం’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నీరవ్‌షా, ఆర్ట్: సురేష్ సెల్వరాఘవన్, నిర్మాణ సంస్థ: కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్‌గుడ్ ఫిల్మ్స్, సమర్పణ: కొణిదెల సురేఖ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మోహన్‌రాజా.