Nayanthara: కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతున్న నయనతార

అందాల ముద్దుగుమ్మలు సినిమాలు చేస్తూనే మరో వైపు బిజినెస్‌లు చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ బిజినెస్‌లతో రాణిస్తున్నారు. తాజాగా లేడి సూపర్ స్టార్ నయనతార మరో వ్యాపారంలోకి అడుగుపెట్టింది నయనతార. ‘ది లిప్‌బామ్ కంపెనీ’ పేరుతో ఆమె ఓ బ్యూటీ రిటైల్ బ్రాండ్‌ను ప్రారంభించింది. చర్మవ్యాధి నిపుణురాలు అయిన రేణిత రాజన్‌తో కలిసి ఈ బ్రాండ్‌ను లాంచ్ చేసింది.
‘ మా ఇద్దరికీ దశాబ్ద కాలంగా పరిచయం ఉంది. నయనపై నాకు చాలా నమ్మకముంది. అందుకే ఈ బ్రాండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో భాగమయ్యాం. ‘ది లిప్‌బామ్ కంపెనీ’ కి సంబంధించి గత కొన్నేళ్లుగా మా ఇద్దరి మధ్య చర్చలు నడుస్తున్నాయి. కరోనా కారణంగా మరింత ఆలస్యమైంది. అయితే ఎట్టకేలకు మా బ్యూటీ బ్రాండ్‌ను ప్రారంభించాం’ అని రాజన్ చెప్పుకొచ్చారు. కాగా గతంలో కత్రినా కైఫ్ కూడా ఇలాగే బ్యూటీ బిజినెస్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
త్వరలో విఘ్నేష్ శివన్‌ని పెళ్లి చేసుకోనున్న నయనతార సినిమాల జోరు ఏ మాత్రం తగ్గించడం లేదు. సీనియర్ హీరోలు రజనీకాంత్, చిరంజీవిల పక్కన నటిస్తూనే కుర్ర హీరోలతోను సినిమాలు చేస్తుంది. నయన్ నటించిన ‘కాత్తువక్కుల రెండు కాదల్’ త్వరలోనే విడుదల కానుంది. ఇది కాకుండా ఆమె ప్రస్తుతం చిరంజీవి సరసన ‘గాడ్ ఫాదర్’లో నటిస్తోంది. వీటితో పాటు ‘కనెక్ట్’, ‘గోల్డ్’, షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ తెరకెక్కిస్తోన్న ఓ సినిమాలోనూ నయనతారనే హీరోయిన్గా ఎంపికైనట్లు సమాచారం..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Business news
- Nayanthara
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

