Bhakta Kannappa | ప్రభాస్ శివుడు నయనతార పార్వతి.. మంచు విష్ణు భారీ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
Bhakta Kannappa | మంచు విష్ణు దాదాపు వంద కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్న సినిమా భక్త కన్నప్ప. సాక్షాత్తు శివుడు సన్నిదైన శ్రీకాళహస్తిలో ఈ సినిమాను గతనెలలో ఘనంగా ప్రారంభించారు. మహాభారతం టెలివిజన్ షోకు దర్శకత్వం వహించిన ముకేష్ కుమార్ సింగ్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు.
Bhakta Kannappa | మంచు విష్ణు దాదాపు వంద కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్న సినిమా భక్త కన్నప్ప. సాక్షాత్తు శివుడు సన్నిదైన శ్రీకాళహస్తిలో ఈ సినిమాను గతనెలలో ఘనంగా ప్రారంభించారు. మహాభారతం టెలివిజన్ షోకు దర్శకత్వం వహించిన ముకేష్ కుమార్ సింగ్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమాకు ముందు నుంచి జనాల్లో కాస్త క్యూరియాసిటీ ఉంది. అసలు మార్కెట్ లేని విష్ణు.. ఏకంగా వంద కోట్లతో సినిమా చేస్తున్నాడని ఓ వైపు.. మరో వైపు ప్రభాస్ సాక్షాత్తు శివుడిగా కనిపించబోతున్నట్లు మంచు విష్ణునే కన్ఫర్మ్ చేయడంతో ఒక్కసారిగా సినిమాపై సినీ లవర్స్‌లో అంచనాలు ఓ రేంజ్లో పెరిగాయి.
ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో రూమర్ నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా పార్వతిగా లేడీ సూపర్ స్టార్ నయనతార కనిపించబోతున్నట్లు ఇన్సైడ్ టాక్. ఇప్పటికే ఆమెతో కథా చర్చలు కూడా ముగిసాయని.. మరి కొన్ని రోజుల్లో అఫీషియల్ అప్డేట్ కూడా ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ.. ఒక వేళ నయన్ కూడా ఈ సినిమాలో భాగం అయితే మట్టుకు సినిమా రేంజ్ మరింత పెరిగే చాన్స్ ఉంది. అంతేకాకుండా యోగి తర్వాత దాదాపు 16ఏళ్ల తర్వాత ప్రభాస్, నయనతార జోడి కట్టనున్నారు. శ్రీకాళహస్తీశ్వర మహత్యం కావ్యం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం.
ఇక ఈ సినిమా గ్రాండియర్ స్కేల్లో దాదాపు వంద కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సమాచారం. మైథలాజికల్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాను మోహన్‌బాబు నిర్మిస్తున్నాడు. పరచూరి గోపాలకృష్ణ, సాయిమాధవ్ బుర్ర, తోట ప్రసాద్ వంటి మేటి రచయితలు ఈ సినిమాకు పనిచేస్తున్నారు. విజువల్స్ పరంగానూ, టెక్నికల్ పరంగానూ ఈ సినిమాను హై స్టాండర్డ్స్‌లో రూపొందిస్తున్నారట. ఈ సినిమాలో భక్త కన్నప్ప గొప్పతాన్ని ఈ తరానికి చూపించబోతున్నారట. శ్రీవిష్ణుకు జోడీగా టైగర్ నాగేశ్వరరావు బ్యూటీ నుపూర్ సనన్ నటిస్తున్నట్లు ప్రకటించినా.. ఇటీవలే ఈ బ్యూటీ డేట్ ఇష్యూల వల్ల తప్పుకున్నట్లు శ్రీ విష్ణు కన్ఫర్మ్ చేశాడు. ప్రస్తుతం మేకర్స్ మరో కొత్త హీరోయిన్ కోసం గాలిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

