మగనారి పగ
బాలీవుడ్లో వైవిధ్య నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. ఏ పాత్ర అయినా.. ప్రాణం పెట్టి పోషిస్తాడు. ఆయన సినిమా వస్తుందటేనే కొందరు ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తుంటారు. అదే ప్రయోగాత్మక చిత్రంలో నవాజుద్దీన్ నటిస్తున్నాడంటే.. భారీ అంచనాలు ఏర్పడతాయి.
- ఓటీటీ హిట్
హడ్డి జీ5: సెప్టెంబర్ 7
తారాగణం: నవాజుద్దీన్ సిద్ధిఖీ, అనురాగ్ కశ్యప్, మహ్మద్ జీషన్, ఇళా అరుణ్ తదితరులు
దర్శకత్వం: అక్షత్ అజయ్‌శర్మ
బాలీవుడ్లో వైవిధ్య నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. ఏ పాత్ర అయినా.. ప్రాణం పెట్టి పోషిస్తాడు. ఆయన సినిమా వస్తుందటేనే కొందరు ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తుంటారు. అదే ప్రయోగాత్మక చిత్రంలో నవాజుద్దీన్ నటిస్తున్నాడంటే.. భారీ అంచనాలు ఏర్పడతాయి. అలాంటి నటుడు ట్రాన్స్‌జెండర్ పాత్రలో నటించిన ‘హడ్డి’ చిత్రం జీ5లో రికార్డు స్ట్రీమింగ్ అవుతున్నది. కథలోకి వెళ్తే ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌కు చెందిన హడ్డి (నవాజుద్దీన్) ఆడపిల్లగా మారాలని అనుకుంటాడు. శస్త్రచికిత్స ద్వారా ట్రాన్స్‌జెండర్‌గా మారుతాడు. హారికగా పేరు మార్చుకుంటాడు.
అదే నగరంలో రేవతి (ఇళా అరుణ్) ట్రాన్స్జెండర్లకు అండగా నిలుస్తుంటుంది. హారిక ఆమెను ఆశ్రయిస్తుంది. అక్కడే ఉంటున్న ఇర్ఫాన్ (మహ్మద్ జీషన్) హారికను ఇష్టపడతాడు. తనను పెండ్లి చేసుకుంటానని చెబుతాడు. హారిక నిరాకరిస్తుంది. మరోవైపు నగరంలో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ ప్రమోద్ (అనురాగ్ కశ్యప్) రేవతిని హత్యచేస్తాడు. తనకు ఆశ్రయమిచ్చిన రేవతిని దారుణంగా చంపిన ప్రమోద్ను అంతమొందించాలని హారిక భావిస్తుంది. ఇందుకోసం హారిక ఏం చేసింది? ఇర్ఫాన్ పెండ్లి ప్రతిపాదన ఏమైంది? అన్నది మిగిలిన కథ. ప్రథమార్ధం కాస్త నిదానంగా సాగినా, ద్వితీయార్ధం వేగంగా సాగుతుంది. విభిన్నత కోరుకునే ప్రేక్షకులను ‘హడ్డి’ అలరిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

