Michael Movie Pre-Release Event | ఈ సారి ‘మైఖేల్’తో సందీప్ కిషన్ పాన్ ఇండియా రేంజ్లో హిట్టు కొట్టేలా కనిపిస్తున్నాడు. నిన్న మొన్నటి వరకు ఎలాంటి అంచనాలు లేని ఈ సినిమాపై ఇటీవలే రిలీజైన ట్రైలర్ ఎక్కడ లేని బజ్ క్రియేట్ చేసింది. ‘విక్రమ్’ తరహా కంటెంట్ కనబడటంతో ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అనే క్యూరియాసిటీ ఆడియెన్స్‌లో నెలకొంది. రంజిత్ జయంకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 3న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస ప్రమోషన్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను పెద్ద ఎత్తులో ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 31న హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో జరుగునుంది. కాగా ఈ వేడుకకి నాని గెస్ట్‌గా రాబోతున్నాడు. లవ్ కమ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. సందీప్‌కు జోడీగా దివ్యాంశ కౌశిక్ నటిస్తుంది. విజయ్ సేతుపతి కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు, నటుడు గౌతమ్ మీనన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. సందీప్ కిషన్, అనసూయ, వరలక్ష్మీ శరత్‌కుమార్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ ఎల్ఎల్పి,కరణ్ సి ప్రొడక్షన్స్ బ్యానర్లపై పుస్కుర్ రామ్మోహన్ రావు, భరత్ చౌదరీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
Natural🌟 for #Michael 🤗@NameisNani gracing the Pre-Release Event Tomorrow❤️🔥
📍JRC Convention, 6 PM onwards#MichaelFromFeb3rd@sundeepkishan @VijaySethuOffl @Divyanshaaaaaa @jeranjit @anusuyakhasba @SVCLLP @KaranCoffl @adityamusic @shreyasmedia pic.twitter.com/AoOAbWX9ZY
— Aditya Music (@adityamusic) January 30, 2023