Shyam Singh Roy Movie | ఆస్కార్ బరిలో నాని ‘శ్యామ్ సింగ రాయ్’.. మూడు విభాగాల్లో పోటీ
Shyam Singh Roy in Oscars | ఫలితంతో సంబంధంలేకుండా కంటెంట్ ప్రధానంగా సాగే కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నాని. ఈయన నుండి సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటీ అని ప్రేక్షకులు భావిస్తుంటారు. గతేడాది ఈయన నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని రెండు విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకుల నుండి గొప్ప ప్రశంసలు అందుకున్నాడు. దేవదాసిగా సాయిపల్లవి పాత్ర సినిమాకు ప్రాణం పోసింది. కృతిశెట్టి, మడొన్నా సెబాస్టియన్లు తమ తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈసినిమా ఆస్కార్ పోటీకి వెళ్ళింది.
పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రం మూడు విభాగాల్లో ఆస్కార్ నామినేషన్‌కు పోటీ పడుతుంది. పీరియాడిక్ డ్రామా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, భారతీయ సంప్రదాయ క్లాసిక్ విభాగాల జాబితాలో నామినేషన్ పరిశీలనకు పంపారు. కాగా వచ్చే ఏడాది 95వ ఆస్కార్ అవార్డుల వేడుక జరుగనుంది. శ్యామ్ సింగ రాయ్ చిత్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం వండర్స్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన మొదటి వారంలో టాప్10 నాన్-ఇంగ్లీష్ మూవీస్ కేటగిరిలో ఈ చిత్రం 3వ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. అత్యధిక రేటింగ్ సాధించడంతోపాటు.. దాదాపు 10 వారాల పాటు నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండ్‌లో ఉంది. నిహారిక ఎంటర్టైనమెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

