Naani | మహేష్ బాబు తర్వాత మనోడే.. న్యాచురల్ స్టార్ దూకుడు
Nani | ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు కదా పెద్దలు. కానీ నాని మాత్రం ముందు రచ్చ చేయడానికి రెడీ అవుతుంటాడు. అందులో ఎప్పుడూ విజయం సాధిస్తూనే ఉంటాడు. ఓవర్సీస్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోగా రికార్డులు తిరగరాస్తూనే ఉన్నాడు నాని. ఇప్పుడు మరోసారి ఇదే ప్రూవ్ చేసాడు.
Nani | ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు కదా పెద్దలు. కానీ నాని మాత్రం డిఫెరెంట్. ఇల్లు మనదే కదా ఎప్పుడైనా గెలవొచ్చు అంటాడీయన. అందుకే ముందు రచ్చ చేయడానికి రెడీ అవుతుంటాడు. అందులో ఎప్పుడూ విజయం సాధిస్తూనే ఉంటాడు. ఓవర్సీస్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోగా రికార్డులు తిరగరాస్తూనే ఉన్నాడు నాని. ఇప్పుడు మరోసారి ఇదే ప్రూవ్ చేసాడు. తెలుగులో మహేష్ బాబు తర్వాత ఆ స్థాయి కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ నానికే సొంతం. చాప కింద నీరులా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు నాని. ఎప్పట్నుంచో ఇదే చేస్తున్నాడు.. ఇప్పుడూ ఇదే చేసాడు ఈయన. టాలీవుడ్‌కు ఎంతమంది హీరోలు వచ్చినా కూడా నాని మాత్రం మినిమమ్ గ్యారెంటీ హీరో.. మోస్ట్ బ్యాంకబుల్ హీరో అనిపించుకున్నాడు. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ అయితే తన అడ్డా చేసుకున్నాడు న్యాచురల్ స్టార్. తాజాగా హాయ్ నాన్నతో మరోసారి అక్కడ మ్యాజిక్ చేస్తున్నాడు ఈయన. ఈ సినిమా అప్పుడే 1 మిలియన్ మార్క్ అందుకుంది.
తెలుగు ఇండస్ట్రీలో మహేష్ బాబుకు 11 మిలియన్ మార్క్ సినిమాలు ఉంటే.. నానికి 9 ఉన్నాయి. టాప్ స్టార్స్ కూడా ఎవరూ ఈ ఫీట్ అందుకోలేదు. వాళ్లంతా నాని వెనకాలే ఉన్నారు. పక్కింటి అబ్బాయిలా కనిపించడం నానికి పెద్ద ప్లస్. అందుకే ఆయన సినిమాలు చూడ్డానికి ఆడియన్స్ ఎగబడుతుంటారు. టాక్ ఎలా ఉన్నా ఒక్కసారి నాని కోసం చూడొచ్చు అనే నమ్మకం తెచ్చుకున్నాడు ఈ హీరో. అదే ఈయన సినిమాలకు వరంగా మారుతుంది. ఒకటి రెండు కాదు.. ఏకంగా 9వ సారి మిలియన్ మార్క్ అందుకోవడం అంటే చిన్న విషయం కాదు. బాలీవుడ్లో కూడా చాలా మంది హీరోలకు వర్కవుట్ కాని ఫిగర్ ఇది. అలాంటిది ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఇలాంటి రికార్డులు అందుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఈగ నుంచే ఓవర్సీస్లో నాని బ్యాగ్రౌండ్ స్కోర్ మొదలైంది. 2012లో తొలిసారి ఈగతో మిలియన్ మార్క్ అందుకున్నాడు నాని. అయితే అది రాజమౌళి మేనియా.. అందులో నాని మ్యాజిక్ ఏం లేదన్నారంతా.
అందులో నిజం కూడా లేకపోలేదు. ఎందుకంటే అప్పుడు నానికి అంత మార్కెట్ లేదు. కానీ ఆ తర్వాత మాత్రం ప్యూర్‌గా నాని తన మ్యూజిక్ మొదలుపెట్టాడు. భలే భలే మగాడివోయ్, నేను లోకల్, నిన్ను కోరి, ఎంసిఏ, జెర్సీ, అంటే సుందరానికి, దసరా సినిమాలతో మిలియన్ డాలర్ మార్క్ అందుకున్నారు. ఇందులో అంటే సుందరానికి మన దగ్గర ఆడలేదు.. కానీ అక్కడి ఆడియన్స్ మాత్రం ఆదరించారు. హాయ్ నాన్నకు సైతం మొదటిరోజు నుంచే ఓవర్సీస్లో మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా మూడు రోజుల్లోనే మిలియన్ మార్క్ అందుకుంది ఈ చిత్రం. అంతేకాదు.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయింది కూడా ముందు అక్కడే. శౌర్యు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. 9 సార్లు మిలియన్ మార్క్ చేరడం అంటే చిన్న విషయమేం కాదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

