Natu Natu Song: నాటు నాటు సాంగ్‌పై ఉక్రెయిన్ సైనికుల డ్యాన్స్.. వీడియో
Natu Natu Song : ఉక్రెయిన్ సైనికులు నాటు నాటు స్టెప్పులేశారు. మికోలైవ్ నగరానికి చెందిన సైనికులు ఆ డ్యాన్స్ చేశారు. రష్యా దాడిని ఖండిస్తూ ఆ సైనికులు నాటు నాటు పాటను ఎంజాయ్ చేశారు. ఆ పేరడీ సాంగ్‌కు సోషల్ మీడియాలో తెగ లైక్‌లు వచ్చేస్తున్నాయి.
న్యూఢిల్లీ: ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట(Natu Natu Song)పై ఉక్రెయిన్ సైనికులు చిందేశారు. ఇటీవల ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. నాటు నాటు పాటపై ఉక్రెయిన్ సైనికులు డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ తరహాలోనే.. ఉక్రెయిన్ సైనికులు స్టెప్పులు వేసి ఇరగదీశారు.
జేన్ ఫెడటోవా అనే వ్యక్తి ఈ వీడియోను షేర్ చేశారు. రెండు నిమిషాల నిడివ ఉన్న ఈ వీడియోను మికోలైవ్ నగరంలోని సైనికులు షూట్ చేశారు. అయితే ఆర్ఆర్ఆర్ చిత్రంలో బ్రిటీషర్లకు వ్యతిరేకంగా ఎలా రామ్, భీమ్‌లు పాట పాడారో.. అలాగే రష్యా దాడికి వ్యతిరేకంగా ఉక్రెయిన్ సైనికులు కూడా తమ డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు.
Військові з Миколаєва зняли пародію на пісню #NaatuNaatu з 🇮🇳 фільму "RRR", головний саундтрек якого виграв Оскар цього року.
У оригінальній сцені гол.герої піснею виражають протест проти британського офіцера (колонізатора) за те, що він не пустив їх на зустріч. pic.twitter.com/bVbfwdjfj1
— Yevheniia Fedotova🇺🇦 (@y_fedotova) May 29, 2023
ఆర్ఆర్ఆర్ ఫిల్మ్ నిర్మాతలు తమ అఫీషియల్ అకౌంట్లోనూ ఉక్రెయిన్ సైనికుల డ్యాన్స్‌కు చెందిన వీడియోను పోస్టు చేశారు. ఇప్పటికే ఈ వీడియోకు ఆరు లక్షల వ్యూవ్స్ వచ్చాయి. ఆరు వేల మంది లైక్ కొట్టారు.
ఈ యేటి ఆస్కార్స్ వేడుకల్లో నాటు నాటు సాంగ్‌కు బెస్ట్ ఓరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ఆ పాటను నిజానికి ఉక్రెయిన్‌లోనే షూట్ చేశారు. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ అధికార నివాసం బయటే ఈ పాటను షూట్ చేశారు. అయితే అప్పటికి ఉక్రెయిన్‌పై ఇంకా రష్యా అటాక్ చేయలేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

