Bigg Boss: బయటైతే కాళ్లు విరగ్గొట్టేవాడిని: నటరాజ్ మాస్టర్

బిగ్ బాస్ తాజా ఎపిసోడ్లో ఆసక్తికర సన్నివేశాలు చోటుకు చేసుకున్నాయి. షణ్ముఖ్.. సిరిని దూరం పెడుతుండడంతో ఆమె తెగ ఫీల్ అయిపోయింది. అతనితో మాట్లాడేందుకు చాలా ప్రయత్నించింది. ఇక లగ్జరీ బడ్జెట్ కోసం అతికిందంటే అదృష్టమే అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో ఫుడ్ ఐటమ్స్ రాసి ఉన్న బంతులు గోడకు విసరాలి. ఏవైతే గోడకు అతుకుతాయో అవి హౌస్‌మేట్స్‌కు అందుతాయని తెలిపాడు.
ఈ టాస్క్‌లో విశ్వ విఫలం కాగా, సన్నీ, రవి, శ్రీరామ్ ఎలాగోలా పూర్తి చేశారు. ఇక మానస్.. హమీదాకు గోరు ముద్దలు తినిపిస్తూ ముచ్చిటించాడు. నటరాజ్ మాస్టర్ లోలోపల చాలా ఫైర్ అయ్యాడు. ఎలా ఆడాలని తెలియదు. బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. ఏమైన అంటే ప్రొఫెషనల్ డైలాగ్స్. బయట అయి ఉంటే కాళ్లు విరగ్గొట్టే వాడిని అంటూ సీరియస్ అయ్యాడు. ఎవరి గురించి అంటున్నాడో తెలియక సన్నీ, రవి, యానీ మాస్టర్, లోబో తలలు పట్టుకున్నారు.
ఇక బెస్ట్, వరస్ట్ పర్ఫార్మర్ని ఎన్నుకోవాలని బిగ్ బాస్ ఆదేశించడంతో కెప్టెన్ జెస్సీ.. హమీదాను; షణ్ముఖ్, హమీదా, సిరి, కాజల్, రవి, నటరాజ్ మాస్టర్, శ్రీరామచంద్ర.. మానస్‌ను; విశ్వ, లహరి.. ప్రియను; యానీ మాస్టర్.. సన్నీని; శ్వేత వర్మ.. నటరాజ్ మాస్టర్, సన్నీ.. షణ్ముఖ్లనను వరస్ట్ పర్ఫామర్లుగా సూచించారు.
మానస్ తనకు తానే వరస్ట్ పర్ఫార్మర్ అని చెప్పుకున్నాడు. అలా కుదరదని చెప్పడంతో మానస్.. జెస్పీ పేరు చెప్పాడు. ఎక్కువ ఓట్లు మానస్‌కి వచ్చిన కారణంగా మానస్‌ని జైలుకి తరలించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- bigg boss
- natraj master
RELATED ARTICLES
తాజా వార్తలు
MCD: కాలుష్యంపై చర్చ.. ఢిల్లీ మున్సిపల్ సమావేశాల్లో గందరగోళం
‘ప్రజా వీరుడు పండుగ సాయన్న’
కాచారంలో తక్షణమే మైనింగ్ తవ్వకాలు ఆపాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
PM Modi | ఢిల్లీలో మోదీతో పోలండ్ ప్రధాని భేటీ.. ఇండియా-పోలండ్ మధ్య కీలక ఒప్పందాలు
FMG Doctors | ఎఫ్ఎంజీ వైద్యుల నిరసన.. అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

