విజేతల కథలకే పట్టం
68వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. ఈసారి జాతీయ పురస్కారాల కోసం 50 విభాగాల్లో 30 భాషల్లోని 450 చిత్రాలు పోటీ పడ్డాయి. వీటిలో 300 ఫీచర్ ఫిల్మ్స్ కాగా...150 నాన్ ఫీచర్ ఫిల్మ్స్ ఉన్నాయి. సూర్య నటించిన ‘సురారైపోట్రు’ ఐదు అవార్డులతో అగ్రస్థానంలో నిలిచింది. ‘తానాజీ’ చిత్రానికి మూడు అవార్డులు దక్కాయి
- 68వ జాతీయ అవార్డుల ప్రకటన
- ‘సూరారైపోట్రు’కు ఐదు అవార్డులు
- ఉత్తమ తెలుగు చిత్రం ‘కలర్‌ఫొటో’
- ఉత్తమ సంగీత దర్శకుడు తమన్
68వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. ఈసారి జాతీయ పురస్కారాల కోసం 50 విభాగాల్లో 30 భాషల్లోని 450 చిత్రాలు పోటీ పడ్డాయి. వీటిలో 300 ఫీచర్ ఫిల్మ్స్ కాగా…150 నాన్ ఫీచర్ ఫిల్మ్స్ ఉన్నాయి. సూర్య నటించిన ‘సురారైపోట్రు’ ఐదు అవార్డులతో అగ్రస్థానంలో నిలిచింది. ‘తానాజీ’ చిత్రానికి మూడు అవార్డులు దక్కాయి. ‘సూరారైపోట్రు’ చిత్రానికిగాను సూర్య, ‘తానాజీ’ చిత్రానికిగాను అజయ్‌దేవ్‌గణ్ ఉత్తమ నటులుగా పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కలర్ ఫొటో’ పురస్కారాన్ని గెల్చుకోగా, ఉత్తమ సంగీత చిత్రంగా ‘అల వైకుంఠపురములో’ ఉత్తమ కొరియోగ్రఫీ, మేకప్ విభాగాల్లో ‘నాట్యం’ సినిమా అవార్డులను దక్కించుకుంది.
సంకల్పబలానికి నిదర్శనం
లక్ష్యాన్ని సాధించుకోవాలనే తపన ఉంటే విజయాలు అనివార్యమని నిరూపించిన సినిమా ఆకాశం నీ హద్దురా (సురారైపోట్రు). ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా దర్శకురాలు సుధా కొంగర ఈ సినిమాను రూపొందించారు. తక్కువ ధరల్లో మధ్య తరగతి ప్రజలకు విమానయానం అందుబాటులోకి రావాలనే ప్రయత్నం ప్రేక్షకులను ఆకట్టుకుంది. కార్పొరేట్ శక్తులను ఎదిరించి కథానాయకుడు తన కలను సాకారం చేసుకునే తీరు మెప్పించింది. కెప్టెన్ మహా పాత్రలో సూర్య నటనకు ప్రశంసలు దక్కగా, సుందరిగా అపర్ణ బాలమురళి సహజమైన అభినయం కనబర్చింది. కోవిడ్ భయంకరంగా ఉన్న సమయంలో ఓటీటీలో రిలీజైన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది. అప్పటిదాకా సరైన విజయాలు లేక ఇబ్బందులు పడుతున్న సూర్యకు ఉపశమనాన్ని కలిగించింది.
చెదిరిన ప్రేమ వర్ణం ‘కలర్‌ఫొటో’
సాధారణంగా ప్రేమకథలకు ధనిక, పేద తారతమ్యాలు.. సామాజిక నేపథ్యాలు అడ్డుగోడలుగా నిలుస్తుంటాయి. ‘కలర్‌ఫొటో’ చిత్రంలో మాత్రం శారీరక రంగు కారణంగా ఓ యువకుడు ప్రేమలో వివక్షను ఎదుర్కొనే వైనాన్ని ఆవిష్కరించారు. ఈ వర్ణ వివక్ష అంశమే ఈ సినిమాను విభిన్న ప్రేమకథా చిత్రంగా నిలిపింది. తన చెల్లెలు నలుపు రంగులో ఉన్న యువకున్ని ప్రేమించిందనే నెపంతో ఓ అన్నయ్య ప్రతీకారేచ్ఛతో రగిలిపోవడం, చివరకు ఈ ప్రేమకథ విషాదాంతంగా మారడమే ఈ సినిమా ఇతివృత్తం. 1997 మచిలీపట్నం నేపథ్యంలో తెరకెక్కించిన ఈ ప్రేమకథ హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలతో ఆకట్టుకుంది. ఈ గ్రామీణ ప్రేమకథలో సుహాస్ అభినయం అందరి ప్రశంసలందుకుంది. విలన్‌గా సునీల్ తనదైన విలనీతో మెప్పించాడు. సందీప్‌రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ‘ఆహా’ ఓటీటీలో విడుదలై మంచి ఆదరణ సొంతం చేసుకుంది.
తమన్‌కు తొలిసారి జాతీయ అవార్డు
‘అల వైకుంఠపురములో’ చిత్రం ద్వారా తమన్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఈ సినిమా పాటలు యూ ట్యూబ్, సోషల్‌మీడియాలో సంచలనాల్ని సృష్టించాయి. భాషాంతరాల్ని అధిగమించి యావత్ సంగీత ప్రేమికుల్ని ఉర్రూతలూగించాయి. ‘సామజవర గమన’ పాట చక్కటి మెలోడీగా ఆకట్టుకుంది. ‘బుట్ట బొమ్మ’ ‘రాములో రాములో’ పాటలు యువతరాన్ని ఉర్రూతలూగించాయి. సినిమా విజయంలో తమన్ సంగీతం కీలక భూమిక పోషించింది. ‘కిక్’ సినిమాతో సంగీత దర్శకుడిగా తెలుగులో తొలి విజయాన్ని అందుకున్న తమన్ అక్కడి నుంచి వెనుతిరిగి చూసుకోలేదు. ఎన్నో వాణిజ్య చిత్రాల్లో తనదైన విలక్షణ బాణీలతో ప్రేక్షకుల్ని మెప్పించారు. ‘అల వైకుంఠపురములో’ చిత్రం ద్వారా తొలిసారి జాతీయ అవార్డును గెలుచుకొని సరికొత్త ఘనతను సాధించారు.
తండ్రి కల కోసం
ఉత్తమ హిందీ చిత్రంగా ‘తులసీదాస్ జూనియర్’ అవార్డును గెల్చుకుంది. సంజయ్ దత్, రాజీవ్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో బాలనటుడు వరుణ్ బుద్ధదేవ్‌ను జ్యూరీ స్పెషల్ మెన్షన్గా పేర్కొంది. స్నూకర్ ఆటలో తండ్రి కలను నిజం చేసేందుకు కొడుకు చేసే ప్రయత్నమే ఈ సినిమా కథా నేపథ్యం.
యోధుడి కథకు జై
శివాజీ కమాండర్‌గా పనిచేసిన యోధుడు తానాజీ జీవిత కథను ఆధారంగా తీసుకుని అజయ్ దేవగణ్ నటించిన సినిమా తానాజీ. ఈ సినిమా ఉత్తమ నటుడు, హోల్సమ్ ఎంటర్టైన్మెంట్, బెస్ట్ కాస్ట్యూమ్ విభాగాల్లో జాతీయ పురస్కారాలు గెల్చుకుంది. దర్శకుడు ఓం రావత్ ఈ చిత్రాన్ని రూపొందించారు. తానాజీ పాత్రలో అజయ్ దేవగణ్ ప్రదర్శించిన వీరత్వం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

