నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆయ్’. అంజి కె.మణిపుత్ర దర్శకుడు. జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు, విద్యా కొప్పినీడి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలను నిర్మాతలు ఒక ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటివరకూ విడుదల చేసిన వీడియోలు, పోస్టర్స్, పాటలు ఇలా అన్నింటికీ మంచి స్పందన లభిస్తున్నదని మేకర్స్ ఆనందం వెలిబుచ్చారు. తాజాగా ఈ మూవీ నుంచి ‘నాయకి ఏమైనాదే.. రంగనాయకి ఏమైనాదే..’ అంటూ సాగే పాటను విడుదల చేశారు.
మాస్ బీట్తో ఆకట్టుకుంటున్న ఈ పాటను సురేశ్ బనిశెట్టి రాయగా, రామ్ మిర్యాల స్వరపరిచారు. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. నితిన్, నయన్ సారికలపై చిత్రీకరించిన ఈ పాటకు భాను మాస్టర్ నృత్యరీతుల్ని సమకూర్చారు. లిరిక్స్, సంగీతమే కాక, పాట చిత్రీకరణ కూడా కలర్ఫుల్గా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ చిత్రానికి కెమెరా: సమీర్ కల్యాణి, సమర్పణ: అల్లు అరవింద్.