తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పా!
హీరోగా వంద సినిమాలు.. క్యారెక్టర్ నటుడిగా రెండొందల సినిమాలు.. 50ఏండ్ల పై చిలుకు నట ప్రయాణం.. లెక్కకు మించిన విభిన్న పాత్రలు.. వెరసి ‘నవరసరాయ’ డా.నరేశ్ విజయకృష్ణ. సినిమాను భుజాలపై మోయగలిగే ఆరుదైన క్యారెక్టర్ నటుడాయన.. కేవలం నరేశ్ కారణంగా విజయం సాధించిన సినిమాలు చాలానే ఉన్నాయ్.
హీరోగా వంద సినిమాలు.. క్యారెక్టర్ నటుడిగా రెండొందల సినిమాలు.. 50ఏండ్ల పై చిలుకు నట ప్రయాణం.. లెక్కకు మించిన విభిన్న పాత్రలు.. వెరసి ‘నవరసరాయ’ డా.నరేశ్ విజయకృష్ణ. సినిమాను భుజాలపై మోయగలిగే ఆరుదైన క్యారెక్టర్ నటుడాయన.. కేవలం నరేశ్ కారణంగా విజయం సాధించిన సినిమాలు చాలానే ఉన్నాయ్. త్వరలో ఆయన ప్రధాన పాత్ర పోషించిన ‘క్రేజీ కల్యాణం’ సినిమా విడుదల కానున్నది. అనుపమ పరమేశ్వరన్, తరుణ్‌భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి బద్రప్ప గాజుల దర్శకుడు. బూసం జగన్మోహన్రెడ్డి నిర్మాత. ఈ నెల 16న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో నరేశ్ విలేకరులతో మాట్లాడారు.
ఒక ఊరిలోని మధ్య తరగతి కుటుంబంలో జరిగే కథ ఇది. తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య జరిగే ఎమోషనల్ స్ట్రగుల్సే ఈ సినిమా ప్రధానాంశం. ఈ ఎమోషన్‌కు ఆడియన్స్ కచ్చితంగా కనెక్టవుతారు. నిజాయితీగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీస్తే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు. మా ఇంటి బంగారం, ఇరుముడి సినిమాలే అందుకు నిదర్శనం. అదే క్రమంలో ‘క్రేజీ కల్యాణం’ ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇది హానెస్ట్ ఎంటర్టైనర్. బద్రప్ప ఈ తరం దర్శకుడు. జగన్మోహన్రెడ్డి ఈ తరం నిర్మాత. ఎంతో ప్యాషన్‌తో ఈ సినిమా తెరకెక్కించారు. తెలుగు ప్రజలందరికీ దసరా పెద్ద పండుగ. ఆ పండుగ సంబరమంతా ‘క్రేజీ కల్యాణం’ సినిమాలో కనిపిస్తుంది. ఈ సినిమా ఓ నాలుగు స్తంభాలాట. నేను, తరుణ్‌భాస్కర్, అనుపమ, అఖిల్.. మేం నలుగురమే ఆ స్తంభాలం. అందులో నాపాత్రకు కాస్త ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఒక పాత్ర.. దాని చుట్టు కొన్నిపాత్రలు. గతంలో హాలీవుడ్లో ఇలాంటి సినిమాలు వచ్చేవి. ఇప్పుడు హీరోయిజానికి అర్థం మారిపోయింది. ఫైట్స్, రొమాన్స్ చేస్తేనే హీరో కాదు. కథను లీడ్ తీసుకొని మెప్పించేవాడే హీరో. అలా చూసుకుంటే ఇందులో నేను హీరోనే. ఇందులో నేను నవరసాలూ పండిస్తూ ఓ తొమ్మిదిమందితో ఒక్కొక్కరి దగ్గరా ఒక్కో ఎమోషన్‌తో డైలాగ్స్ చెప్పే 6 నిమిషాల లెన్తీ సీన్ ఒకటుంది. సింగిల్ టేక్‌లో ఆ సీన్ చేశాను. అందుకే ఈ సినిమాలో ‘నవరసరాయ’ టైటిల్‌ని ఫస్ట్‌టైమ్ వాడుతున్నాం. ఇది తెలంగాణ నేపథ్య చిత్రం. దర్శకుడు బద్రప్ప సహకారంతోనే తెలంగాణ యాసలో డైలాగులు చెప్పాను.
l నేటివిటీకి దూరంగా వెళ్లకుండా కొత్త దారిలో కథను చెబుతూ, ప్రతి పాత్రకూ కొత్త అర్థాన్నీ, ముగింపునీ ఇవ్వడం డైరెక్టర్ కె.విశ్వనాథ్‌గారి శైలి. ఈ సినిమా దర్శకుడు బద్రప్ప శైలి కూడా అదే. ‘క్రేజీ కల్యాణం’ సినిమాను తను అలాగే డీల్ చేశాడు. విశ్వనాథ్‌గారి సినిమాల్లోని ఎమోషన్ని ఈ సినిమాలో తను తీసుకొచ్చాడు. ఇందులోని నాపాత్రలో ఎమోషన్, ఫన్ రెండూ ఉంటాయి. తరుణ్‌భాస్కర్ పోషించిన బాలరాజు పాత్ర ప్రతి ఊరిలో ఉంటుంది. ఇక మధ్య తరగతి అమ్మాయిని అనుపమ పాత్ర ప్రతిబింబిస్తుంది. అలాగే అఖిల్ కూడా మంచి పాత్ర చేశాడు. ఇందులో రక్తపాతాలు లేవు. ఉన్నదంతా వినోదమే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

