Malli Pelli | మళ్లీ పెళ్లి విడుదలపై కోర్టుకెళ్లిన నరేశ్ మాజీ భార్య
Malli Pelli | టాలీవుడ్ యాక్టర్ నరేశ్ (Naresh), పవిత్రాలోకేశ్ (Pavitra Lokesh) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ మళ్లీ పెళ్లి (Malli Pelli). మే 26న (రేపు)న థియేటర్లలో విడుదలవుతున్న నేపథ్యంలో.. నరేశ్ మాజీ భార్య (మూడో భార్య) కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది.
Malli Pelli | టాలీవుడ్ యాక్టర్ నరేశ్ (Naresh), పవిత్రాలోకేశ్ (Pavitra Lokesh) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ మళ్లీ పెళ్లి (Malli Pelli). తెలుగు-కన్నడ బైలింగ్యువల్‌గా వస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియో, టీజర్, సాంగ్స్, ట్రైలర్ నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తూ.. సినిమాపై సూపర్ బజ్‌ను క్రియేట్ చేస్తున్నాయి. కాగా మళ్లీ పెళ్లి మే 26న (రేపు)న థియేటర్లలో విడుదలవుతున్న నేపథ్యంలో.. నరేశ్ మాజీ భార్య (మూడో భార్య) రమ్య రఘుపతి సినిమా రిలీజ్‌పై స్టే విధించాలని కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది.
సినిమాలోని కొన్ని సన్నివేశాలు తనను చెడుగా చూపించారని, అవి తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉండటంతో విడుదలను నిలిపేయాలని పిటిషన్ దాఖలు చేసింది. సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. తాజాగా పిటిషన్ దాఖలు చేయడం కొత్త ట్విస్ట్ నెలకొంది. మరి మళ్లీ పెళ్లి అనుకున్న ప్లాన్ ప్రకారం విడుదలవుతుందా..? లేదా..? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
నరేశ్, పవిత్రా లోకేశ్ ప్రేమ వ్యవహారం, పెళ్లి టాపిక్తోపాటు నరేశ్‌కు అతని మూడో భార్య రమ్య రఘుపతికి మధ్య జరిగే కాంట్రవర్సీల నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ ద్వారా చెప్పేశాడు డైరెక్టర్. గత కొంతకాలంగా నరేశ్ రియల్‌లైఫ్‌లో జరిగిన, జరుగుతున్న వ్యవహారాలను ఈ చిత్రంలో ఉన్నది ఉన్నట్టుగా చూపించబోతున్నట్టు ట్రైలర్‌తో క్లారిటీ ఇచ్చేశాడు. ఈ చిత్రాన్ని హోంబ్యానర్ విజయ కృష్ణ మూవీస్‌పై నరేశ్ తెరకెక్కిస్తున్నారు.
సహజనటి జయసుధ, శరత్ బాబు, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మళ్లీ పెళ్లి చిత్రానికి సురేశ్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నరేశ్, పవిత్రాలోకేశ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ చాలా కాలంగా నెట్టింట్లో వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే.
మళ్లీ పెళ్లి ట్రైలర్..
మళ్లీ పెళ్లి ఫస్ట్ లుక్..
మళ్లీ పెళ్లి టీజర్ ..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

