అజ్ఞాతం వైపు ప్రయాణం
నారా రోహిత్ నటిస్తున్న సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌కి ‘కపాలి’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ‘A Journey Into The Unkonown’ ఉపశీర్షిక. హన్సిక మోత్వాని కథానాయిక. రామ్ గన్ని దర్శకుడు. కళ్యాణ చక్రవర్తి మంథినా,భానుకిరణ్ ప్రతాప నిర్మాతలు. శనివారం నారా రోహిత్ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్‌ని మేకర్స్ విడుదల చేశారు.
నారా రోహిత్ నటిస్తున్న సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌కి ‘కపాలి’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ‘A Journey Into The Unkonown’ ఉపశీర్షిక. హన్సిక మోత్వాని కథానాయిక. రామ్ గన్ని దర్శకుడు. కళ్యాణ చక్రవర్తి మంథినా,భానుకిరణ్ ప్రతాప నిర్మాతలు. శనివారం నారా రోహిత్ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఇంటెన్స్ ఎమోషన్స్‌తో కనిపిస్తున్న నారా రోహిత్‌ని ఈ పోస్టర్లో చూడొచ్చు. కనిపించని ఓ శక్తితో పోరాడుతున్నట్టు ఈ పోస్టర్లో ఆయన కనిపిస్తున్నాడు.
ఆయన తలపై కిరీటంలా కనిపిస్తున్న వంకర చెట్టు కొమ్మలు కథలోని మిస్టికల్ కనెక్షన్‌ని సూచిస్తున్నాయి. నేపథ్యంలో కనిపిస్తున్న ప్రాచీన చిహ్నాలతో కూడిన డిజైన్ క్షుద్రశక్తులు, పురాణ నేపథ్యాన్ని, పోస్టర్లో ఎర్రటి కళ్ళతో కనిపిస్తున్న భయానక స్త్రీ రూపం అతీంద్రియ శక్తిని సూచిస్తున్నాయి. పోలీసులకు, అతీంద్రియ శక్తులకు మధ్య సాగే పోరాటమే ఈ సినిమా కథాంశమని పోస్టర్ చెబుతున్నది. ఈ చిత్రానికి సమర్పణ: విజయ్‌కృష్ణ లింగమనేని, నిర్మాణం: సప్తఅశ్వ మీడియా వర్క్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

