Geethanjali Malli Vachindi | తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని భామ అంజలి (Anjali). ఈ రాజోలు భామ ఓ వైపు గ్లామరస్ పాత్రలు చేస్తూనే.. మరోవైపు నటనకు ఆస్కారమున్న పాత్రలను చేస్తోంది. అంజలి టైటిల్ రోల్ పోషించిన గీతాంజలి చిత్రానికి సీక్వెల్ గీతాంజలి మళ్లీ వచ్చింది (Geethanjali Malli Vachindi) వస్తుందని తెలిసిందే. Anjali 50వ సినిమాగా తెరకెక్కుతుండగా.. శివతుర్లపాటి (డెబ్యూ) దర్శకత్వం వహిస్తున్నాడు.
చాలా కాలానికి ఈ మూవీ నుంచి నాన్న లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. శ్రీనివాస మౌళి రాసిన ఈ పాటను ప్రవీణ్ లక్కరాజు కంపోజిషన్‌లో వేద వాగ్దేవి పాడింది. హార్రర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేశ్, సత్య, షకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవి శంకర్, రాహుల్ మాధవ్ ఇతర నటీనటులు కీ రోల్స్ పోషిస్తున్నారు. ఎంవీవీ సినిమాస్ బ్యానర్‌తో కలిసి కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై కోన వెంకట్ తెరకెక్కిస్తున్నారు.
మిమ్మల్ని ఊపిరాడకుండా చేసేలా సీక్వెల్ ఉండబోతోందని హామీ ఇస్తున్నాం. గీతాంజలి మళ్లీ వచ్చింది.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో 2024లో వస్తోంది అంటూ మేకర్స్ ఇప్పటికే అదిరిపోయే అప్డేట్ అందించారు. అంజలి ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో రాంచరణ్ హీరోగా ఆర్సీ 15గా తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్‌లో వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. షూటింగ్ దశలో ఉంది. అంజలి మరోవైపు విశ్వక్ సేన్‌తో కలిసి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో కూడా నటిస్తోంది.
నాన్న లిరికల్ వీడియో సాంగ్..