నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘హాయ్ నాన్న’. శౌర్యువ్ దర్శకుడు. వైర ఎంటర్టైన్మెంట్ పతాకంపై మోహన్ చెరుకూరి, డా॥ విజయేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ఆరంభించబోతున్నారు.
అందులో భాగంగా ‘సమయమా..’ అనే గీతాన్ని ఈ నెల 16న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా గురువారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నాని చిరునవ్వులు చిందిస్తూ ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ‘తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సాగే ఎమోషన్ డ్రామా ఇది. కథానుగుణంగా సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. సకుటుంబ కథా చిత్రంగా మెప్పిస్తుంది’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సాను జాన్ వర్గీస్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, దర్శకత్వం: శౌర్యువ్.