నాని కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఈ నెల 30న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవల విడుదలైన టీజర్, పాటలతో ఆకట్టుకున్న ఈ చిత్రం నుండి బుధవారం మరో లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. నిర్మాత మాట్లాడుతూ ‘నాని కథానాయకుడిగా నటిస్తున్న పూర్తి మాస్ చిత్రమిది. ఆయన లుక్, పాత్ర చిత్రానికి హైలైట్‌గా వుంటుంది. తాజాగా విడుదలైన చమ్కీల అంగిలేసి పాట ప్రతి పెళ్లిళ్ల సీజన్‌కు సెట్ అయ్యే ఫోక్ మెలోడీ.. సంతోష్ నారాయణన్ క్యాచీ ట్యూన్స్ అందించాడు. పెళ్లిలో భార్యభర్తలు పరస్పర వాదులాడుకునే సొగసైన పాటిది. ప్రతి భార్య భర్త రిలేట్ చేసుకునే పాట ఇది. పాట చిత్రీకరణ కూడా ఆకర్షణీయంగా వుంటుంది. తప్పకుండా చిత్రం కూడా అద్భుతమైన విజయం సాధిస్తుందనే నమ్మకం వుంది’ అన్నారు.