అల్లెల్లే.. అల్లెల్లే.. కలిసే ఎదలే..
సూపర్‌స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. డా.మోహన్‌బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. రషా తడాని కథానాయిక. అజయ్ భూపతి దర్శకుడు. అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్ సమర్పణలో పి.కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకున్నది.
సూపర్‌స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. డా.మోహన్‌బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. రషా తడాని కథానాయిక. అజయ్ భూపతి దర్శకుడు. అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్ సమర్పణలో పి.కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకున్నది. ప్రచారంలో భాగంగా ఈ సినిమాలోని తొలి పాటను విడుదల చేశారు.
అగ్ర హీరో నాని పాట ను ఆవిష్కరించి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ‘అల్లెల్లే.. అల్లెల్లే.. అదిరే కలలే.. అల్లెల్లే.. అల్లెల్లే.. కలిసే ఎదలే..’ అంటూ సాగే ఈ పాటను శ్రీమణి రాయగా, జీవీ ప్రకాశ్‌కుమార్ స్వరపరచి, హరిప్రియతో కలిసి ఆలపించారు. మెలోడియస్గా మొదలై, ఉత్సాహవంతంగా ఈ ట్రాక్ సాగింది. ప్రేమలోని భావోద్వేగాలను ఆవిష్కరిస్తూ సాగిన ఈ పాటకు జయకృష్ణ, రషా కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజువల్స్ కూడా అందంగా ఉన్నాయి. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: జయకృష్ణ ఐఎస్సీ, నిర్మాణం: చందమామ కథలు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

