హాలీవుడ్ శైలిలో ఉందంటున్నారు

‘రాజా విక్రమార్క’ ట్రైలర్ ైస్టెలిష్‌గా హాలీవుడ్ శైలిలో ఉందని ప్రశంసిస్తున్నారు. హీరోగా కార్తికేయ కెరీర్లో వైవిధ్యమైన సినిమాగా నిలుస్తుంది అన్నారు ఆదిరెడ్డి. ఆయన సమర్పణలో 88 రామారెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘రాజా విక్రమార్క’. కార్తికేయ హీరోగా నటిస్తున్నారు. శ్రీ సరిపల్లి దర్శకుడు. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకురానుంది. నేడు ట్రైలర్‌ను విడుదలచేయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు ఆదిరెడ్డి మాట్లాడుతూ ‘సంగీతదర్శకుడు దేవిశ్రీప్రసాద్ స్వగ్రామమైన వెదురుపాక నుంచి నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టా. ఇదివరకు బాద్షా, గబ్బర్‌సింగ్, గ్యాంబ్లర్తో పాటు పలు సినిమాలకు పంపిణీదారుడిగా వ్యవహరించా. ధనుష్ ‘రైల్’ చిత్రాన్ని తెలుగులో విడుదలచేశా. నిర్మాతగా నా రెండో సినిమా ఇది. న్యూఏజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించాం. ఓటీటీ కోసం కాకుండా మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతోనే సినిమా చేశాం’ అన్నారు. 88రామారెడ్డి మాట్లాడుతూ ‘టీజర్‌కు ఐదు మిలియన్లకుపైగా వ్యూస్ లభించాయి. తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు తగినట్లుగా సాగే ైస్టెలిష్ స్పై థ్రిల్లర్ చిత్రమిది. ఎన్ఐఏ అధికారిగా కార్తికేయ పాత్ర కొత్తగా ఉంటుంది. అతడి కెరీర్లో మైలురాయిగా నిలుస్తుంది. కథపై ఉన్న నమ్మకంతో నైజాంలో మేమే సొంతంగా విడుదలచేస్తున్నాం. మరో రెండు బౌండ్ స్క్రిప్ట్స్ సిద్ధంగా ఉన్నాయి. ఆ వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం’ పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sambarala Yeti Gattu | ‘సంబరాల ఏటి గట్టు’ రిలీజ్ డేట్ వివాదం.. నిర్మాతకు ఫోన్ చేసి వార్నింగ్!
Ramayana | ‘రామాయణ’ను 3డీలోనే చూడండి.. ప్రేక్షకులకు సాయిపల్లవి ప్రత్యేక విజ్ఞప్తి!
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో అసలు కథ ఏంటో చెప్పనున్న టీమ్!
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
IMAX IN Hyderabad | సినిమా లవర్స్‌కు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో మరో సరికొత్త ఐమ్యాక్స్!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

