నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ‘ది ప్యారడైజ్’ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తూ విజయపథంలో పయనిస్తున్నది. ఈ నేపథ్యంలో హీరో నాని సోషల్‌మీడియా వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘మీ అందరూ చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు. మీరు చేసిన సరదా ట్రోల్స్‌ని కూడా అంతే హాయిగా ఆస్వాదించాను.
ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించిన తీరు నా హృదయాన్ని హత్తుకుంది. అదే సమయంలో విమర్శకులు, సమీక్షకులు చూపించిన లోపాల నుంచి కూడా ఎన్నో విషయాలను నేర్చుకున్నా. ప్రేక్షకులకు ఓ ప్రత్యేకమైన అనుభూతిని అందించాలనే ఉద్దేశ్యంతో రక్తం, చెమట చిందించి ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ సినిమా మీదే’ అని నాని తన ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.