కూతురు ఉంటే బాగుండేది!
‘హాయ్ నాన్న’ సినిమాలో నటిస్తున్నప్పటి నుంచి తనకు ఓ కూతురు ఉంటే బాగుండేదనిపిస్తున్నదని హీరో నాని అన్నారు. ఆయన తాజా చిత్రం ‘హాయ్ నాన్న’ తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శౌర్యువ్ దర్శకుడు. డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకురానుంది.
‘హాయ్ నాన్న’ సినిమాలో నటిస్తున్నప్పటి నుంచి తనకు ఓ కూతురు ఉంటే బాగుండేదనిపిస్తున్నదని హీరో నాని అన్నారు. ఆయన తాజా చిత్రం ‘హాయ్ నాన్న’ తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శౌర్యువ్ దర్శకుడు. డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇటీవల విడుదలైన ‘అమ్మాడి’ అనే పాటకు మంచి స్పందన లభించింది.
ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు కూతురు ఉంటే బాగుండేదనే అభిలాషను వ్యక్తం చేశారు నాని. ఆయన మాట్లాడుతూ ‘ఇంతకుముందు కూడా నాన్న పాత్రలో నటించాను. కానీ ఈ సినిమా ఎందుకో నా హృదయానికి దగ్గరైంది. ఆడపిల్ల తండ్రి తాలూకు ఉద్వేగాలు ఏమిటో అర్థం చేసుకున్నా. నాకు మొదటి నుంచి ఆడపిల్లలంటే ఇష్టం. ఈ సినిమాలో నటించడం మొదలుపెట్టాక ఆ ఇష్టం మరింత పెరిగిపోయింది. ఇప్పుడు నాకు ఓ కూతురు ఉంటే బాగుండేది కదా అనిపిస్తున్నది’ అని చెప్పారు నాని.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

