తెలంగాణ యాసలో శిక్షణ

గత కొన్నేళ్లుగా తెలుగు వెండితెరపై తెలంగాణ యాస, భాషలు గుబాళిస్తున్నాయి. తెలంగాణ నేపథ్య కథల చిత్రణ కూడా ఎక్కువగా కనిపిస్తోంది. తెలంగాణ యాసతో పలికే సంభాషణలు సినిమాలకు కొత్త పరిమళాల్ని అద్దుతున్నాయి. అగ్ర కథానాయకులు మొదలుకొని వర్ధమాన హీరోల వరకు తెలంగాణ మాండలికంలో సంభాషణలు పలికించాలని తాపత్రయపడుతున్నారు. తాజాగా అగ్ర హీరో నాని తెలంగాణ యాసలో సంభాషణల్ని పలికే పనిలో పడ్డారు. వివరాల్లోకి వెళితే…నాని కథానాయకుడిగా నిర్మాత సుధాకర్ చెరుకూరి ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా ద్వారా శ్రీకాంత్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తెలంగాణ నేపథ్యంలో కథను తీర్చిదిద్దారట. తన పాత్రలో సహజ సంభాషణల కోసం నాని తెలంగాణ యాసలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారట. ఇందుకోసం ఆయన ఓ ట్యూటర్‌ను నియమించుకున్నారని తెలిసింది. ప్రస్తుతం నాని ‘శ్యామ్ సింగరాయ్’ ‘టక్ జగదీష్’ ‘అంటే..సుందరానికి’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

