Nani Bold Statement | ‘కోర్ట్’ సినిమా నచ్చకపోతే ‘హిట్ 3’ సినిమాకు రాకండి.. నాని బోల్డ్ స్టేట్మెంట్
Actor Nani | నాని నిర్మాణంలో వస్తున్న తాజా చిత్రం ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’(Court: State vs A Nobody). ఈ సినిమాకు రామ్ జగదీశ్ దర్శకత్వం వహిస్తుండగా.. హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటిస్తున్నారు.
Actor Nani | అగ్ర కథానాయకుడు నాని నిర్మాణంలో వస్తున్న తాజా చిత్రం ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’(Court: State vs A Nobody). ఈ సినిమాకు రామ్ జగదీశ్ దర్శకత్వం వహిస్తుండగా.. హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటిస్తున్నారు. ప్రియదర్శి, శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్ష వర్ధన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. యదార్థ సంఘటనల ఆధారంగా రాబోతున్న ఈ చిత్రం మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్‌తో పాటు ప్రీ రిలీజ్ వేడుకను చిత్రబృందం నిర్వహించింది. ఇక ఈ వేడుకకు నానితో పాటు దర్శకుడు ప్రశాంత్ వర్మ, శ్రీకాంత్ ఓదెలా, మోహనకృష్ణ ఇంద్రగంటి, నాగ్ అశ్విన్ తదితరులు వచ్చి చిత్రబృందానికి విషెస్ తెలిపారు.
అయితే ఈ వేడుకలో నాని మాట్లాడుతూ.. 14వ తేదీ కోర్ట్ సినిమా రాబోతుంది. ఈ సినిమా మీరు మిస్ అవ్వోద్దని నేను కోరుకుంటున్నాను. నా 16 ఏండ్ల కెరీర్లో ఎప్పుడు ఒక వేదికపైకి వచ్చి దయచేసి సినిమాకి వెళ్లండని అడుగలేదు. కానీ, ఈ చిత్ర విషయంలో ఆ మాట అడుగుతున్నా. ఎందుకంటే ఈ సినిమాను మీరు మిస్ అవ్వకుడదు. మీ ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్‌తో మీకు నచ్చిన వారితో సినిమాకి వెళ్లండి. నిర్మాత కదా ఇలానే చెబుతాడు అనుకోవద్దు. మీకు నమ్మకం రావడానికి ఒక విషయం చెబుతాను. మరో రెండు నెలల్లో నా హిట్ 3 సినిమా రిలీజ్ కాబోతుంది. మార్చి 14కి మీరు కోర్ట్ సినిమాకి వెళ్లి అది నచ్చకుంటే నా హిట్ సినిమాకి ఎవరు రాకండి. ఇంతకంటే బలంగా నేనేమీ చెప్పలేను. ఎందుకంటే దీనికన్నా 10రెట్లు ఎక్కువగా ‘హిట్ 3’పై ఖర్చు పెట్టా. అందుకే 14న వెళ్లి సినిమాను చూడండి. చాలా రోజుల తర్వాత ఒక మంచి తెలుగు సినిమాను చూసి బయటకు వస్తారంటూ నాని చెప్పుకోచ్చాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

