Ante Sundaraniki OTT Rights | ఫలితం ఎలా ఉన్నా ప్రేక్షకులకు కొత్త కథలను చూపించాలని అనుకునే అతికొద్ది మంది నటులలో నాని ఒకడు. ఈయన నుంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. రొటీన్‌కు భిన్నంగా కథలను ఎంచుకుంటూ మినిమమ్ గ్యారెంటీ హీరోగా టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘అంటే సుందరానికీ’. ‘బ్రోచేవారెవరురా’ ఫేం వివేక్ ఆత్రేయా దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంపై ప్రేక్షకులలో మొదటి నుంచి భారి అంచనాలున్నాయి. ఇటీవలే విడుదలైన ట్రైలర్ అంచనాలను రెట్టింపు చేశాయి. ఈ చిత్రం జూన్ 10న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం తరచూ ఏదో ఒక అప్డేట్తో ప్రేక్షకులను పలకరిస్తుంది. తాజాగా మేకర్స్ మరో అప్డేట్ను ప్రకటించారు.
‘అంటే సుందరానికి’ నాన్ థియేట్రికల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. అమెజాన్ సంస్థ భారీ ధరకు మేకర్స్‌తో డీల్ కుదిరించుకుందట. సినిమా విడుదలైన నాలుగు వారాల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ చేయాలని ఒప్పందం కదుర్చుకుందట. ఈ చిత్రంలో నానికి జోడీగా నజ్రియా హీరోయిన్గా నటించింది. నజ్రియా తెలుగులో నటించిన మొదటి చిత్రం ఇదే కావడం విశేషం. ఈ చిత్రంలో నాని బ్రహ్మణుడి పాత్రలో నటించగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయిగా నటించింది. మైత్రీ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించాడు.