బాలీవుడ్ రీమేక్‌కు రెడీ అవుతున్న నాని మరో సినిమా…
Nani | చిత్ర పరిశ్రమలో ఒక సినిమా మంచి విజయాన్ని సాధిస్తే దాన్ని రీమేక్ చేయడం సర్వ సాధారణం.
Nani | చిత్ర పరిశ్రమలో ఒక సినిమా మంచి విజయాన్ని సాధిస్తే దాన్ని రీమేక్ చేయడం సర్వ సాధారణం. స్టార్ హీరోల సైతం రీమేక్ లలో నటించడానికి సిద్దంగా ఉంటారు. ఇక టాలీవుడ్లో సూపర్ హిట్లయిన చాలా సినిమాలను బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే పదికి పైగా సినిమాలు బాలీవుడ్లో పట్టాలెక్కనున్నాయి. ఈ క్రమంలో మరో హిట్ సినిమా బాలీవుడ్లో త్వరలోనే రీమేక్ కానున్నట్లు సమాచారం.
నాని ప్రధాన పాత్రలో నటించిన జెర్సీ సినిమాను ఇప్పటికే షాహిద్ కపూర్ రీమేక్ చేయ్యగా..గతేడాది డిసెంబర్ చివరివారంలో ఈ చిత్రం విడుదలవ్వాల్సి ఉంది. కాని కరోనా కారణంతో విడుదల వాయిదా పడింది. ఇదిలా ఉండగానే నాని నటించిన మరో సినిమాపై బాలీవుడ్ కన్ను పడింది. నాని, సాయిపల్లవి, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం శ్యామ్ సింగరాయ్, టాక్సివాలా ఫేం రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై వెంకట్బోయినపల్లి నిర్మించాడు. గతేడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్24న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధించింది. ఏపీలో 50% ఆక్యుపెన్సి ఉన్నా మంచి వసూళ్ళనే రాబట్టింది. మొదట ఈ చిత్రాన్ని సౌత్‌లోని అన్ని భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ భావించినా అది కుదర్లేదు. ఓటీటీ వేదికగా నెట్‌ఫ్లిక్స్ లో ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన శ్యామ్ సింగరాయ్ బెంగాల్ రచయిత కావడంతో ఉత్తరాది ప్రేక్షకులు బాగా ఆదరిస్తారన్న నమ్మకంతో బాలీవుడ్లో రీమేక్ చేయాలని భావిస్తున్నారట. దీంతో ఈ చిత్ర హిందీ రీమేక్ హక్కులను ప్రముఖ దిగ్గజ ప్రొడక్షన్ సంస్థ కొనుగోలు చేసిందని సమాచారం. అంతే కాకుండా ఇందులో హీరోగా బాలీవుడ్ స్టార్ నటించనున్నట్లు సమాచారం.ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. నాని నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన హిట్ సినిమా బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావుతో దిల్‌రాజు రూపొందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

