Nani31 | అంటే సుందరానికీ కాంబో రిపీట్.. బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..!
Nani31 | గతేడాది విడుదలైన అంటే సుందరానికీ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తొలిరోజే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా పబ్లిసిటీ ఖర్చులు కూడా వెనక్కి తీసుకురాలేపోయింది. నిజానికి ఈ సినిమా చాలా మందికి నచ్చింది.
Nani31 | గతేడాది విడుదలైన అంటే సుందరానికీ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తొలిరోజే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా పబ్లిసిటీ ఖర్చులు కూడా వెనక్కి తీసుకురాలేపోయింది. నిజానికి ఈ సినిమా చాలా మందికి నచ్చింది. స్టోరీగాని, స్క్రీన్ ప్లే చాలా ఫ్రెష్ గా ఉంటుంది. అయితే రిలీజ్ టైమ్ బాలేకో, అదృష్టం కలిసిరాలేకో ఈ సినిమా కమర్షియల్ ఫేయిల్యూర్ గా మిగిలిపోయింది. కాగా ఫలితం ఎలా ఉన్నా నాని మాత్రం వివేక్ పై ఉన్న నమ్మకంతో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దసరా సినిమా తెచ్చిన ఉత్సాహంతో నాని తన తదుపరి సినిమా హాయ్‌నాన్న షూటింగ్ శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. శౌర్యువ్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 7న రిలీజ్ కాబోతుంది.
ఇది సెట్స్‌పైన ఉండగానే వివేక్‌తో మరో సినిమాను పట్టాలెక్కించాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ను మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా లాంచింగ్ కార్యక్రమాలు దసరా పండగ రోజు జరుపుతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అదే రోజున ఫస్ట్‌లుక్ పోస్టర్ కూడా రిలీజ్ కానుంది. ఆర్ఆర్ఆర్ వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాను నిర్మించిన దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక దర్శకుడు ఆత్రేయా ఈ సినిమాను యాక్షన్ జానర్లో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటి వరకు వివేక్ నుంచి ఇలాంటి జోనర్లో సినిమా రాలేదు. క్లాస్ పేరున్న వివేక్ మాస్ కథను హ్యాండిల్ చేస్తాడా అనే డౌట్ కూడా చాలా మందిలో ఉంది.
#Nani31 it is… 🔥🔥
The most lovable combo of our Natural Star @NameisNani & #VivekAthreya is back. ❤️🤗
UNCHAINED on Oct 23rd.
Muhurtham is on Oct 24th.Get ready to witness thrills, chills, and fun. pic.twitter.com/e4ZhM0yWyx
— DVV Entertainment (@DVVMovies) October 21, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | దేశానికే ఆదర్శంగా నిలిచేలా తిరుమలలో వాటర్,ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ అభివృద్ధి : టీటీడీ
4 Militants Killed | మణిపూర్‌లో ప్రత్యర్థి నాగా వర్గాల మధ్య కాల్పులు.. నలుగురు మిలిటెంట్లు మృతి
ప్రభుత్వ ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దని ఎమ్మెల్యే మందుల సామేల్కి వినతి
Hunter Road | సౌకర్యవంతమైన సేవల కోసం హంటర్ రోడ్డులో కొత్త బస్ స్టాప్
సారపాకలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

