Nani31 | అంటే సుందరానికీ కాంబో రిపీట్.. ఈ సారి యాక్షన్ మంత్రం
Nani-Vivek athreya | గతేడాది విడుదలైన అంటే సుందరానికీ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తొలిరోజే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా పబ్లిసిటీ ఖర్చులు కూడా వెనక్కి తీసుకురాలేపోయింది. నిజానికి ఈ సినిమా చాలా మందికి నచ్చింది
Nani-Vivek athreya | గతేడాది విడుదలైన అంటే సుందరానికీ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తొలిరోజే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా పబ్లిసిటీ ఖర్చులు కూడా వెనక్కి తీసుకురాలేపోయింది. నిజానికి ఈ సినిమా చాలా మందికి నచ్చింది. స్టోరీగాని, స్క్రీన్ ప్లే చాలా ఫ్రెష్ గా ఉంటుంది. అయితే రిలీజ్ టైమ్ బాలేకో, అదృష్టం కలిసిరాలేకో ఈ సినిమా కమర్షియల్ ఫేయిల్యూర్ గా మిగిలిపోయింది. కాగా ఫలితం ఎలా ఉన్నా నాని మాత్రం వివేక్ పై ఉన్న నమ్మకంతో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దసరా సినిమా తెచ్చిన ఉత్సాహంతో నాని తన తదుపరి సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. నాని30 టైటిల్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శౌర్యవ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇక ఈ సినిమా పూర్తి కాగానే వివేక్ తో సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. రేపో మాపో సెట్స్ మీదకు కూడా వెళ్లనుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ ను దర్శకుడు వివేక్ ఆత్రేయా తెలిపాడు. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కబోతున్నట్లు వెల్లడించాడు. ఇప్పటి వరకు వివేక్ నుంచి ఇలాంటి జోనర్లో సినిమా రాలేదు. క్లాస్ పేరున్న వివేక్ మాస్ కథను హ్యాండిల్ చేస్తాడా అనే డౌట్ కూడా చాలా మందిలో ఉంది. ఇక దసరాతో నాని తిరుగులేని కంబ్యాక్ ఇచ్చాడు. రూరల్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ రా యాక్షన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టింది. నానిని వంద కోట్ల క్లబ్ లో నిలబెట్టింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Nani
- nani31
- Tollywood
- Vivek athreya
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | దేశానికే ఆదర్శంగా నిలిచేలా తిరుమలలో వాటర్,ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ అభివృద్ధి : టీటీడీ
4 Militants Killed | మణిపూర్లో ప్రత్యర్థి నాగా వర్గాల మధ్య కాల్పులు.. నలుగురు మిలిటెంట్లు మృతి
ప్రభుత్వ ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దని ఎమ్మెల్యే మందుల సామేల్కి వినతి
Hunter Road | సౌకర్యవంతమైన సేవల కోసం హంటర్ రోడ్డులో కొత్త బస్ స్టాప్
సారపాకలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

