Nandamuri Tarakaratna | సినిమాని తలపించే రేంజ్లో తారకరత్న, అలేఖ్య లవ్‌స్టోరీ..!
చాలా మంది తారకరత్న లవ్‌స్టోరీ గురించి తెలుసు కోవాలని ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే రీసెంట్గా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తారక రత్న చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే సోషల్‌మీడియాలో ఆయన లవ్‌స్టోరీ గురించి టాపిక్ వైరల్ అవుతోంది..
Tarakaratna love story | సినీ నటుడు నందమూరి తారకరత్న నారా లోకేష్ పాదయాత్రలో గుండెపోటుకు గురైయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తారకరత్న ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. ఇక ఇదిలా ఉంటే గత రెండు రోజులుగా తారకరత్నకు సంబంధించిన ప్రతీ విషయం నెట్టింట తెగ వైరల్ అవుతూ వస్తున్నాయి. కాగా తాజాగా చాలా మంది తారకరత్న లవ్‌స్టోరీ గురించి తెలుసు కోవాలని ఆసక్తి చూపుతున్నారు.
నందమూరి తారకరత్నది ప్రేమ వివాహం. 2012లో తారకరత్న, అలేఖ్యరెడ్డిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. అయితే తారకరత్న ప్రేమను ఇంట్లో వాళ్లు అంగీకరించలేదట. దాంతో సంఘీ టెంపుల్లో వివాహం చేసుకున్నారట. ఇక వీరిద్దరి లవ్‌స్టోరీ సినిమాల్ని తలపించే విధంగా ఉంటుంది. గతంలో ఓ ఇంటర్వూలో తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి వాళ్ల లవ్‌స్టోరీ గురించి తెలిపారు. ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తున్నప్పుడు కామన్ ఫ్రెండ్ ద్వారా తారకరత్న పరిచయం అయినట్లు అలేఖ్య తెలిపింది. అంతేకాకుండా తారకరత్న.. చైన్నైలో అలేఖ్య సిస్టర్‌కు సీనియర్ అట. ఇలా వీరిద్ధరి మధ్య పరిచయం కాస్త స్నేహంగా మారిందని వెల్లడించారు.
కాగా ఒకరోజు తారకరత్న తనకు ప్రపోజ్ చేశారని, ఆయన ప్రవర్తన నచ్చి తన ప్రేమకు అంగీకరించానని అలేఖ్య చెప్పారు. ఇదే విషయాన్ని ఇంట్లో చెప్పడంతో ఇద్దరి కుటుంబంలో కూడా వాళ్ల పెళ్లికి నో చెప్పారని తెలిపారు. అయితే అదే టైమ్‌లో ఎంపీ విజయసాయిరెడ్డి మద్ధతు ఉండటంతో 2012 ఆగస్టు 2న వీరి వివాహం సంఘీ టెంపుల్లో జరిగిందని అలేఖ్య రెడ్డి చెప్పారు. కాగా అలేఖ్య రెడ్డికి ఇది రెండో వివాహం. మొదటి భర్తతో విభేదాలు రావడంతో విడాకులు ఇచ్చేసింది. ఈ కారణంగానే నందమూరి ఫ్యామిలీ తారకరత్న పెళ్ళికి అడ్డంకులు తెలిపినట్లు టాక్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసం చేసిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

