రెడీ టూ యాక్షన్
అగ్ర నటుడు బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ సినీ అరంగేట్రానికి రంగం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. నందమూరి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ తొలి చిత్రానికి ‘హనుమాన్' ఫేమ్ ప్రశాంత్‌వర్మ దర్శకత్వం వహించబోతున్నారు.
అగ్ర నటుడు బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ సినీ అరంగేట్రానికి రంగం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. నందమూరి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ తొలి చిత్రానికి ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్‌వర్మ దర్శకత్వం వహించబోతున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ప్రకటన వెలువడింది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభంకానుంది. పౌరాణిక ఇతిహాసం ప్రేరణతో రూపొందించిన ఈ కథలో మోక్షజ్ఞ పాత్రను నవ్యరీతిలో తీర్చిదిద్దబోతున్నారని తెలిసింది. ఇప్పటికే నటన, నృత్యాలు, పోరాటఘట్టాల్లో ప్రత్యేక శిక్షణ పొందిన మోక్షజ్ఞ, లుక్స్, ైస్టెల్ పరంగా సరికొత్త మేకోవర్‌తో కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మోక్షజ్ఞ కొత్త స్టిల్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయన ఛార్మింగ్ లుక్స్‌తో కనిపిస్తున్నారు. నందమూరి అందగాడి ైస్టెల్ అదిరిపోయిందంటూ అభిమానులు ఈ ఫొటోపై కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. మోక్షజ్ఞ సోదరి తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

